మంగళవారం 02 మార్చి 2021
National - Jan 15, 2021 , 18:57:37

భారీ మొసలిని కాపాడిన వన్యప్రాణుల సంరక్షకులు

భారీ మొసలిని కాపాడిన వన్యప్రాణుల సంరక్షకులు

అహ్మదాబాద్‌: జనం నివసించే ప్రాంతానికి వచ్చిన భారీ మొసలిని వన్యప్రాణుల సంరక్షణ సిబ్బంది కాపాడారు. గుజరాత్‌ రాష్ట్రం వడోదరలోని విరోడ్‌ గ్రామంలో ఒక భారీ మొసలిని స్థానికులు గుర్తించారు. వెంటనే అటవీశాఖకు సమాచారం అందించారు. వన్యప్రాణులను రక్షించే బృందం అక్కడికి వెళ్లింది. అతి కష్టం మీద ఆ మొసలిని బోనులో సురక్షితంగా బంధించింది. అనంతరం దానిని అటవీ శాఖకు అప్పగించారు. కాగా భారీ మొసలిని సిబ్బంది బంధించే వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo