పీఎమ్ కుసుమ్ పథకం కింద ఫీడర్ స్థాయి సోలరైజేషన్ అమలుకు మార్గదర్శకాలు

ఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించిన అనంతరం పిఎమ్-కుసుమ్ పథకం కాంపోనెంట్-సి కింద ఫీడర్ స్థాయి సోలరైజేషన్ అమలు కోసం మార్గదర్శకాలను జారీ చేయాలని పునరుత్పాదక మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఇ) నిర్ణయించింది. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 19.2.2019 న జరిగిన సమావేశంలో పిఎం-కుసుమ్ పథకాన్ని ఆమోదించింది. ఈ పథకం మూడు భాగాలను కలిగి ఉంటుంది. కాంపోనెంట్-ఎలో గ్రౌండ్ మౌంటెడ్ గ్రిడ్ కనెక్ట్ చేయబడిన పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ల సంస్థాపన, కాంపోనెంట్-బిలో సౌరశక్తితో కూడిన వ్యవసాయ పంపుల ఏర్పాటు , కాంపోనెంట్-సిలో గ్రిడ్-అనుసంధాన వ్యవసాయ పంపులకు సౌర పలకలు అమర్చడం ఉంటుంది.
నవంబర్ 8, 2019 న పిఎం-కుసుమ్ పథకం భాగం-సి అమలు కోసం మంత్రిత్వ శాఖ వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేసింది. పిఎం-కుసుమ్ పథకం నిబంధనల ప్రకారం గ్రిడ్‌కు అనుసంధానించిన వ్యవసాయ పంపులను 30శాతం చొప్పున కేంద్ర -రాష్ట్ర రాయితీతో సౌర శక్తి పలకలు అమర్చుకోవచ్చు. ఇందులో 40శాతం వాటాను రైతు సమకూర్చుకోవాలి. అనుమతించిన సౌర సామర్థ్యం కిలోవాట్స్‌లో పంప్ సామర్థ్యానికి రెండు రెట్లు ఉంటుంది. మిగులు విద్యుత్తును డిస్కామ్ కొనుగోలు చేస్తుంది. ఈ కార్యక్రమ ప్రయోగాత్మకంగా అమలు చేయవలసి ఉన్నందున..వివిధ మోడళ్ల నెట్ మీటరింగ్ ల ఉపయోగం, బిఎల్డిసి పంపుతో ప్రస్తుతం ఉన్న పంపులను భర్తీ చేయడం లేదా ఇతర వినూత్న మోడల్‌ను ఉపయోగించుకునే అవకాశాన్ని ఆయా రాష్ట్రాలకు ఇచ్చారు.
రాష్ట్రాలతో జరిపిన చర్చల ఆధారంగా పిఎమ్-కుసుమ్ పథకం కాంపోనెంట్-సి కింద ఫీడర్ స్థాయి సోలరైజేషన్‌ను కూడా చేర్చాలని నిర్ణయించారు. దీని ప్రకారం ఫీడర్ స్థాయి సోలరైజేషన్ విస్తృత అమలు కోసం ఫ్రేమ్‌వర్క్‌ను అందించడానికి ఈ మార్గదర్శకాలను జారీ చేస్తున్నారు.
అమలుచేసే విధానం:
డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (డిస్కామ్) విద్యుత్ విభాగం ఆయా ప్రాంతాలలో ఫీడర్ స్థాయి సోలరైజేషన్ కోసం అమలు చేసే ఏజెన్సీగా ఉంటుంది. ఫీడర్ స్థాయి సోలరైజేషన్ కోసం సౌర విద్యుత్ ప్లాంట్ సంస్థాపనకు టెండర్, ఇతర సంబంధిత కార్యకలాపాల కోసం డిస్కామ్కు సహాయపడటానికి రాష్ట్ర ప్రభుత్వం మరే ఇతర నిపుణుల ఏజెన్సీని అయినా నియమించవచ్చు. వ్యవసాయ ఫీడర్లు ఇప్పటికే వేరు చేసిన చోట ఈ పథకం కింద ఫీడర్లను సౌర శక్తి పలకలు అమర్చవచ్చు. తద్వారా తక్కువ మూలధన వ్యయం,విద్యుత్ ఖర్చు పరంగా కూడా తక్కువ మొత్తం అవుతుంది. వ్యవసాయం కోసం భారీ సామర్ధ్యం కలిగిన ఫీడర్లను ఈ పథకం కింద సోలరైజేషన్ కోసం పరిగణించవచ్చు.
వ్యవసాయ ఫీడర్‌కు మొత్తం వార్షిక విద్యుత్ అవసరాన్ని అంచనా వేస్తారు. అలాగే ఆ వ్యవసాయ ఫీడర్‌కు వార్షిక విద్యుత్ అవసరాన్ని తీర్చగల సామర్థ్యం ఉన్న సౌర విద్యుత్ ప్లాంట్‌ను కాపెక్స్ మోడ్ లేదా రెస్కో మోడ్ ద్వారా ఏర్పాటు చేయవచ్చు. ఉదాహరణకు 10 లక్షల యూనిట్ల వార్షిక విద్యుత్ అవసరం ఉన్న ఫీడర్ విద్యుత్తును 600 కిలోవాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్లాంట్ ద్వారా 19శాతం సియుఎఫ్తో సరఫరా చేయవచ్చు. సౌర విద్యుత్ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి అధిక లేదా తక్కువ సియుఎఫ్ ప్రాంతాలలో లభించే సగటు సౌర ఇన్సోలేషన్ను బట్టి పరిగణిస్తారు.
ఒకే ఫీడర్ కోసం విద్యుత్ అవసరాన్ని తీర్చడానికి లేదా 11 కెవి వద్ద లేదా డిఎస్ఎస్ అధిక వోల్టేజ్ స్థాయి వైపు శక్తిని అందించడానికి డిస్ట్రిబ్యూషన్ సబ్ స్టేషన్ (డిఎస్ఎస్) నుండి వెలువడే బహుళ వ్యవసాయ ఫీడర్ల కోసం ఫీడర్ స్థాయి సౌర విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయవచ్చు. అది స్థానికంగా లభించే భూమి లభ్యత, సాంకేతిక సాధ్యాసాధ్యాలు మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఫీడర్ స్థాయి సోలరైజేషన్ కోసం సౌర విద్యుత్ ప్లాంట్ సామర్థ్యంపై పరిమితి లేదు.
ఆయా డిస్కమ్‌లు డీఎస్ఎస్లకు సమీపంలో ఉన్న భూమిని గుర్తించవచ్చు. భూమి యాజమాన్యాన్ని లేదా దాని లీజు హక్కులను పొందవచ్చు. డిఎస్ఎస్ వద్ద కనెక్టివిటీని అందించవచ్చు. అలాగే డీఎస్ఎస్ సౌర విద్యుత్ ప్లాంట్ మధ్య ప్రసార మార్గాన్ని వేయవచ్చు. సిఎఫ్ఏను లెక్కించే ఉద్దేశ్యలో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు రూ. 3.5 కోట్లు/మెగావాట్ గా ఉన్నది. ఈ స్కీమ్ కింద ఎంత సామర్థ్యం ఉన్న పంపులనైనా సౌరీకరణ అనుమతించబడుతుంది. అయితే, 7.5 హెచ్‌పి కంటే ఎక్కువ సామర్థ్యం గల పంపుల విషయంలో, సిఎఫ్ఎ 7.5 హెచ్‌పి పంపులకు సౌర సామర్థ్యానికి పరిమితం చేయబడుతుంది.
వ్యవసాయ ఫీడర్లు వేరు చేయబడని చోట ఫీడర్ విభజన కోసం నాబార్డ్, పిఎఫ్‌సి , ఆర్ఇసి నుండి రుణం లభిస్తుంది. ఫీడర్ విభజనకు సహాయం అందించడానికి ఒక పథకాన్ని ఖరారు చేసే పనిలో విద్యుత్ మంత్రిత్వ శాఖ ఉంది. వ్యవసాయంపై విద్యుత్ రాయితీ కారణంగా పొదుపులు, నీటిపారుదల కోసం ఉపయోగించనప్పుడు సౌర విద్యుత్ ప్లాంట్ ద్వారా వచ్చే మిగులు విద్యుత్ ద్వారా వచ్చే ఆదాయం కూడా ఫీడర్ విభజన కోసం తీసుకున్న రుణం తీర్చడానికి ఉపయోగపడుతుంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ‘రక్షణ పరికరాల తయారీలో బలీయ శక్తిగా భారత్’
- కరీం‘నగరం’లో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి : మంత్రి గంగుల
- కొవిడ్ నిబంధనలు కాదన్నందుకు భారీ జరిమానా
- సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ : 400 మంది బాలికలకు బెదిరింపులు
- గొర్రెల పెంపకదార్లకు మంత్రి హరీశ్ అండ
- మరో బాలీవుడ్ దర్శకుడితో ప్రభాస్ చిత్రం..2022లో సెట్స్ పైకి!
- పాలనలో పారదర్శకత కోసమే ప్రజావేదిక : మంత్రి శ్రీనివాస్ గౌడ్
- వుహాన్‌లో డబ్ల్యూహెచ్‌వో బృందం.. ముగిసిన క్వారెంటైన్
- మైనర్ ప్యాంటు జిప్ తీయడం లైంగిక దాడి కాదు: బాంబే హైకోర్టు
- పీఎన్బీలో సెక్యూరిటీ మేనేజర్ పోస్టులు