గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 28, 2020 , 12:29:27

డీఎంకే ఎమ్మెల్యే మృతి

డీఎంకే ఎమ్మెల్యే మృతి

చెన్నై : డీఎంకే ఎమ్మెల్యే ఎస్‌. కథావరయణ్‌(58) మృతి చెందాడు. గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కథావరయణ్‌.. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. కథావరయణ్‌.. వేలూరు జిల్లాలోని గుడియథం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డీఎంకే ఎమ్మెల్యే మృతిపట్ల రాజకీయ పార్టీల నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తమిళనాడు మాజీ మంత్రి, డీఎంకే ఎమ్మెల్యే కేపీపీ సామి అనారోగ్య సమస్యలతో గురువారం కన్నుమూసిన విషయం విదితమే. 


logo