మంగళవారం 07 ఏప్రిల్ 2020
National - Mar 01, 2020 , 23:08:19

రాష్ట్రంలో జీఎస్టీ వృద్ధి తగ్గింది: కేంద్ర ఆర్థిక శాఖ

రాష్ట్రంలో జీఎస్టీ వృద్ధి తగ్గింది: కేంద్ర ఆర్థిక శాఖ

న్యూఢిల్లీ: గతేడాది ఫిబ్రవరి రాబడితో పోలిస్తే రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి జీఎస్టీ వృద్ధి భారీగా తగ్గిందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇవాళ కేంద్ర ఆర్థిక శాఖ ఆయా రాష్ర్టాల ఫిబ్రవరి జీఎస్టీ రాబడి వివరాలు వెల్లడించింది. 2019 ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ట్రంలో రూ. 3460 కోట్ల రాబడి రాగా.. 2020 ఫిబ్రవరిలో రూ. 3,667 కోట్ల జీఎస్టీ రాబడి వచ్చింది. గతేడాదితో పోలిస్తే.. రాష్ట్రం కేవలం 6 శాతం మాత్రమే వృద్ధి సాధించిందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. అదే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 2019 ఫిబ్రవరి రాబడితో పోలిస్తే 23 శాతం వృద్ధి నమోదైనట్లు వివరించింది. ఏపీకి 2019 ఫిబ్రవరిలో రూ. 2088 కోట్ల జీఎస్టీ రాబడి రాగా.. 2020 ఫిబ్రవరిలో రూ. 2563 కోట్ల రాబడి వచ్చినట్లు కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. 


logo