మంగళవారం 26 జనవరి 2021
National - Jan 01, 2021 , 14:45:46

జీఎస్టీ వ‌సూళ్ల‌లో కొత్త రికార్డు

జీఎస్టీ వ‌సూళ్ల‌లో కొత్త రికార్డు

న్యూఢిల్లీ:  గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) వ‌సూళ్లు డిసెంబ‌ర్‌లో కొత్త రికార్డును సృష్టించాయి. ఏకంగా రూ.1.15 ల‌క్ష‌ల కోట్ల వ‌సూళ్ల‌తో జీఎస్టీ ఆల్‌టైమ్ హైని అందుకుంది. 2017, జులై 1న జీఎస్టీని తీసుకొచ్చిన త‌ర్వాత ఈ స్థాయి వ‌సూళ్లు ఇదే తొలిసారని ఆర్థిక‌శాఖ వెల్ల‌డించింది. క‌రోనా త‌ర్వాత ఆర్థిక వ్య‌వ‌స్థ శ‌ర‌వేగంగా కోలుకోవ‌డం, జీఎస్టీ ఎగ‌వేత‌దారుల‌పై క‌ఠిన చ‌ర్య‌ల వ‌ల్ల ఈ భారీ వ‌సూళ్లు సాధ్య‌మైన‌ట్లు తెలిపింది. దేశీయ లావాదేవీల‌పై వ‌చ్చిన ఆదాయాల కంటే వ‌స్తువుల దిగుమ‌తి వ‌ల్ల వ‌చ్చిన ఆదాయం 27 శాతం ఎక్కువ‌గా ఉంది. ఒకే నెల‌లో జీఎస్టీ రూ.ల‌క్ష కోట్లు దాట‌డం వ‌రుస‌గా ఇది మూడోసారి. 


logo