గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 23, 2020 , 01:18:31

3500 టన్నులు కాదు.. 160 కిలోలే!

3500 టన్నులు కాదు.. 160 కిలోలే!
  • యూపీలో బంగారు నిక్షేపాలపై జీఎస్‌ఐ వెల్లడి

కోల్‌కతా/సోన్‌భద్ర: ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో 3,500 టన్నులకుపైగా బంగారు నిక్షేపాలను గుర్తించినట్లు వెలువడిన వార్తలు అవాస్తవమని జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) స్పష్టం చేసింది. జీఎస్‌ఐకు చెందిన ఏ అధికారి కూడా ఆ సమాచారాన్ని ఇవ్వలేదని, సోన్‌భద్రలో ఆ స్థాయిలో పసిడి ఉన్నట్లు తాము అంచనావేయలేదని జీఎస్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌ ఎం శ్రీధర్‌ శనివారం కోల్‌కతాలో పీటీఐ వార్తాసంస్థకు తెలిపారు. సోన్‌పహాడి, హార్డీ గ్రామాల్లో రెండు భారీ బంగారు గనులను గుర్తించినట్లు జిల్లా మైనింగ్‌ అధికారి కేకే రాయ్‌ శుక్రవారం తెలిపిన సంగతి తెలిసిందే. సోన్‌పహాడీలో 2,943.26 టన్నులు, హార్డీలో 646.16 కిలోల పసిడి నిక్షేపాలు ఉన్నట్లు చెప్పారు. అయితే వీటిని శ్రీధర్‌ ఖండించారు. సుమారు 52,806.25 టన్నుల ముడిలోహం ఉన్నదని, అందులో నుంచి 160 కిలోల బంగారాన్ని మాత్రమే తీయవచ్చని తెలిపారు. 


logo