బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 19:07:54

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న పెట్టుబడిదారులు

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న పెట్టుబడిదారులు

హైదరాబాద్: కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆదాయాలు లేక ప్రజలు విలవిలా లాడిపోతుండగా మరికొంతమంది. కొత్త ఆదాయ మార్గాలను అనుసరిస్తున్నారు. ఎక్కువ మంది ఇండ్లకు పరిమితం కావడంతో అందరి చూపు పెట్టుబడుల వైపు మళ్లింది. దీంతో  తెలుగు రాష్ట్రాల్లో  ఇన్వెస్టర్లు పెరుగుతున్నారు. క్రమంగా చాలామంది ఈక్విటీ మార్కెట్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. జూన్ నెలలో సెన్సెక్స్ 7.8 శాతం పెరుగుదలను నమోదు చేసింది. గత కొద్ది రోజులుగా మార్కెట్ జోరందుకున్నది. అందుకు తగినట్లుగా కొత్త ఇన్వెస్టర్లు చేరుతున్నారు. జూలై 20వ తేదీ నుండి జూలై 23వ తేదీ మధ్య అంటే ఈ నాలుగు రోజుల్లో ఏకంగా 1.5 లక్షల మంది కొత్త ఇన్వెస్టర్లు రిజిస్టర్ అయ్యారు. నెల రోజుల్లో 11 లక్షల మంది రిజిస్టర్ అయ్యారు.

బీఎస్ఈలో మొత్తం 5.2 కోట్ల మంది ఇన్వెస్టర్లు రిజిస్టర్ అయ్యారు. ఏడాది కాలంలో ఈ సంఖ్య 1.3 కోట్లుగా ఉంది. ప్రతి నెల ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతోంది. గత నాలుగు రోజుల్లో లక్షన్నర నుండి రెండు లక్షల మంది ఇన్వెస్టర్లు రిజిస్టర్ కాగా, ఇందులోతెలుగు రాష్ట్రాలు కూడా ముందున్నాయి. జూలై 20 నుంచి 23 మధ్య మహారాష్ట్ర నుంచి 30వేల మందికి పైగా, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల నుండి 10వేల చొప్పున, తెలంగాణలో 9వేల మందికి పైగా రిజిస్టర్ అయ్యారు.

ఏపీ రెండో స్థానంలో, తెలంగాణ ఐదో స్థానంలో ఉంది. కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి వద్దనే ఉండటంతో చేతిలోని నగదును ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం చిక్కింది. దీంతో ఈక్విటీలు, బంగారంపై పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు. - రియల్ ఎస్టేట్, భూములు వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలంటే పెద్ద మొత్తం అవసరం. కానీ ఈక్విటీలో పెట్టుబడులకు చిన్న మొత్తాలు సరిపోతాయి. దీంతో ఈ లాక్ డౌన్ అనంతరం ఈక్విటీని ఎంచుకుంటున్నారు. - మార్చిలో స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఆ తర్వాత క్రమంగా పుంజుకుంటున్నాయి. ఆ సమయంలో పెట్టుబడుల వైపు చాలామంది ఆసక్తి కనబరిచారు. - రికవరీ ర్యాలీ చాలామందికి సానుకూలంగా కనిపిస్తోంది. - భారత్‌లో బెట్టింగ్ చట్టబద్దం కాకపోవడంతో ఖాళీ సమయాన్ని గడిపేందుకు ఎలాంటి ప్రత్యామ్నాయాలు లేకపోవడంతో ట్రేడింగ్ పట్ల ఆకర్షితులవుతున్నారు.


 

 logo