దుస్తులుండి అసభ్యంగా ప్రవర్తిస్తే లైంగిక వేధింపు కాదు

ముంబై: బాలిక దుస్తులపై అసభ్యంగా ప్రవర్తిస్తే అది లైంగిక వేధింపు కిందకు రాదని బాంబే హైకోర్టుకు చెందిన నాగపూర్ బెంచ్ తెలిపింది. స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ లేని అసభ్యపు చర్య పోక్సో చట్టం కిందకు రాదని పేర్కొంది. 2016 డిసెంబర్ 12న నాగపూర్‌కు చెందిన 39 ఏండ్ల సతీశ్ తాను నివాసం ఉన్న ప్రాంతానికి చెందిన 12 ఏండ్ల బాలికపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తినేందుకు పండ్లు ఇస్తానని చెప్పి బాలికను తన ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం అసభ్యంగా ప్రవర్తించి ఆమె దుస్తులు తొలగించబోయాడు.
ఇంతలో ఆమె తల్లి కుమార్తె కోసం వెతుకగా బాలికను సతీశ్ తన ఇంటికి తీసుకెళ్లినట్లు పొరుగు వ్యక్తి తెలిపాడు. దీంతో ఆమె సతీశ్ ఇంటికి వెళ్లగా ఆ బాలిక తన ఇంట్లో లేదని తొలుత బుకాయించాడు. అయితే ఆమె బలవంతంగా తలుపు తెరువగా తన కుమార్తె ఏడుస్తూ లోపల కనిపించింది. ఆ వ్యక్తి తనపట్ల అభస్యంగా ప్రవర్తించినట్లు తల్లికి చెప్పింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడు సతీశ్‌పై పోక్సో చట్టంలోని సెక్షన్ 7తోపాటు ఐపీసీ చట్టంలోని 354 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన పోక్సో కోర్టు నిందితుడికి మూడేండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.
కాగా, నిందితుడు సతీశ్ ఈ తీర్పును బాంబే హైకోర్టుకు చెందిన నాగపూర్ బెంచ్‌లో సవాల్ చేశాడు. విచారణ జరిపిన మహిళా న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గణేడివాలా, శరీరక సంపర్కం జరుగకపోతే లైంగిక వేధింపు కాదని చెప్పారు. దుస్తులపై అసభ్యంగా ప్రవర్తించడం కూడా లైంగిక వేధింపు కిందకు రాదని, పోక్సో చట్టంలోని సెక్షన్ 7 దీనికి వర్తించదని అన్నారు. ఈ నేపథ్యంలో ఈ సెక్షన్ కింద అతడు నిర్దోషి అని, ఈ సెక్షన్ కింద విధించిన మూడేండ్ల జైలు శిక్ష చెల్లదని చెప్పారు. అయితే మహిళపై బలవంతపు నేరానికి పాల్పడినందుకు ఐపీసీ సెక్షన్ 354 కింద అతడు దోషి అని తెలిపారు. ఈ సెక్షన్ కింద ఏడాది జైలు శిక్ష విధించవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఇచ్చిన ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.తాజావార్తలు
- మతసామరస్యానికి ప్రతీకగా ఉర్సు
- పాలమూరు కోడలిని ఆశీర్వదించండి
- ‘ప్రగతి’ పనుల్లో జిల్లా ముందుండాలి
- విరాట్ @100 మిలియన్ల ఫాలోవర్స్
- బెంగాల్ మంత్రుల కోడ్ ఉల్లంఘన: ఈసీకి బీజేపీ లేఖ
- బెంగాల్ పొత్తులు నెహ్రూ-గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకం
- ఎన్ఎస్ఈలో లోపం అనూహ్యం.. బట్!
- ‘సత్యం’ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఈడీ పిటిషన్ డిస్మిస్: టెక్ మహీంద్రా
- బావిలోపడి ఇద్దరు చిన్నారులు మృతి
- స్పెక్ట్రం వేలం: తొలి రోజే రూ.77 వేల కోట్ల బిడ్లు!