గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 13:06:25

ఇదేం సంప్ర‌దాయం.. పెళ్లిలో వ‌ధువుని చిత‌క‌బాదే ప‌ద్ద‌తి!

ఇదేం సంప్ర‌దాయం.. పెళ్లిలో వ‌ధువుని చిత‌క‌బాదే ప‌ద్ద‌తి!

భార‌త‌దేశంలో ఎన్నో సంప్ర‌దాయాలు, ప‌ద్ద‌తులున్నాయి. రాష్ట్రం దాట‌గానే భాష‌తో పాటు వారికి చెప్ప‌లేన‌న్ని ప‌ద్ద‌తులు, పాటింపులు ఉంటాయి. పెళ్లి విష‌యానికి వ‌స్తే ఇక చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఎన్నో వింత‌లు చూడొచ్చు. అలాంటి వింత‌ల్లో ఒక వింతని ఈ పెళ్లిలో చూడొచ్చు. ఈ సంప్ర‌దాయాన్ని అక్క‌డి వారు శాంతి గేమ్ అంటార‌ట‌. ఈ ఆట‌లో వ‌ధువును, వ‌రుడి త‌మ్ముడు నెమ‌లి పించంతో కొట్టాలి. అందుకు బ‌దులుగా ఆమె కూడా మ‌రిదిని తిరిగి కొడుతూ స‌ర‌దాగా ఆడాలి.

సంప్ర‌దాయంలో భాగంగా స‌ర‌దాగా ఆడే ఈ ఆట‌లో అక‌స్మాత్తుగా ఆ మ‌రిది రెచ్చిపోయాడు. ఆమె మీద ఏం కోప‌మో ఏమో నెమ‌లి పించంతో చిత‌క‌బాదడం మొద‌లుపెట్టాడు. అది చూసిన అక్క‌డివారంతా ఆశ్చ‌ర్య‌పోయి అత‌డిని శాంత‌ప‌రిచారు. దీనికి కార‌ణం ఏమై ఉంటుందో కాని ఈ వీడియో మాత్రం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న‌ది. 

 



logo