గురువారం 26 నవంబర్ 2020
National - Nov 18, 2020 , 23:03:19

గ్రనేడ్‌ దాడి.. జవాన్లకు తప్పిన ప్రమాదం

గ్రనేడ్‌ దాడి.. జవాన్లకు తప్పిన ప్రమాదం

పుల్వామా : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆగడాలు రోజురోజుకూ పెట్రేగిపోతున్నాయి. బుధవారం పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లను లక్ష్యంగా చేసుకొని ఆ ముష్కరులు గ్రనేడ్‌ దాడి చేశారు. గ్రనేడ్‌ గురి తప్పి రహదారిపై పడటంతో 12మంది పౌరులకు గాయాలయ్యాయి. గుర్తు తెలియని కొందరు ఉగ్రవాదులు కాకాపొరా చౌక్‌ సమీపంలో గ్రనేడ్‌‌ విసిరారు. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్‌ సిబ్బంది ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేసి ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.