శనివారం 23 జనవరి 2021
National - Jan 11, 2021 , 15:50:38

‘నగ్న ఫొటోల కోసం.. దేశానికి ద్రోహం చేశా’

‘నగ్న ఫొటోల కోసం.. దేశానికి ద్రోహం చేశా’

జైపూర్‌: ఐఎస్‌ఐ అమ్మాయిల నగ్న ఫొటోలు, వారితో మాట్లాడటం కోసం దేశానికి ద్రోహం చేసినట్లు హనీట్రాప్ నిందితుడు తెలిపాడు. రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని లాతి నివాసి అయిన 42 ఏండ్ల సత్యనారాయణను పాకిస్థాన్‌ నిఘా సంస్థ అయిన ఐఎస్‌ఐ హనీట్రాప్‌ చేసింది. ఐఎస్‌ఐకు చెందిన మహిళలు సామాజిక మాధ్యమంలోని ఫేక్‌ ఖాతాల ద్వారా అతడ్ని ట్రాప్‌ చేశారు. సెక్సీ సంభాషణలు, నగ్న ఫోటోల ద్వారా సత్యనారాయణను ఆకట్టుకున్నారు. వీటి మాయలో పడిన అతడు వారు పంపే నగ్న ఫోటోలు, వారితో చాటింగ్‌ కోసం ఆర్మీకి చెందిన కీలక సమాచారాన్ని అందించేవాడు. సరిహద్దులో ఆర్మీ కదలికలు, పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్‌లో జరిగే కార్యకలాపాల గురించిన సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వారికి చేరవేసేవాడు. బదులుగా ఆ మహిళల నగ్న ఫోటోలు పొందేవాడు. 

గత కొంత కాలంగా జరుగుతున్న ఈ హనీట్రాప్‌ గురించి నిఘా అధికారులకు తెలిసింది. దీంతో గూఢచర్యం, అధికారిక రహస్యాల చట్టం ఉల్లంఘన ఆరోపణలపై రాజస్థాన్‌ సీఐడీ స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులు సత్యనారాయణను జైసల్మేర్‌లో అరెస్ట్‌ చేశారు. ఐఎస్‌ఐకు చెందిన మహిళలకు పంపిన ఆర్మీ కీలక సమాచారం పత్రాలను అతడి మొబైల్‌ ఫోన్‌లో గుర్తించారు. వీటి గురించి ప్రశ్నించగా నగ్న ఫోటోల కోసం, వారితో చాటింగ్‌ చేయాలన్న దురాశ వల్లనే దేశ ద్రోహానికి పాల్పడినట్లు సత్యనారాయణ అంగీకరించాడు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo