శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Feb 19, 2020 , 00:59:13

అయోధ్యలో ఆ స్థలాన్ని వదిలిపెట్టండి!

అయోధ్యలో ఆ స్థలాన్ని వదిలిపెట్టండి!
  • నాటి బాబ్రీ మసీదు వద్ద ఉన్న శ్మశానాన్ని అలాగే కొనసాగించండి
  • రామాలయ ట్రస్ట్‌కు ముస్లింల తరఫు న్యాయవాది లేఖ

అయోధ్య, ఫిబ్రవరి 18: సనాతన ధర్మాన్ని పాటించాలని, కూల్చివేతకు గురైన బాబ్రీ మసీదు వద్ద ఉన్న ఐదెకరాల శ్మశానాన్ని వదిలేయాలని సుప్రీంకోర్టు న్యాయవాది ఎంఆర్‌ శంషాద్‌ కోరారు. ఈ మేరకు ముస్లింల తరఫున అభ్యర్థిస్తూ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు  ఆయన లేఖ రాశారు. 1885లో జరిగిన అల్లర్లలో మరణించిన 75 మంది ముస్లింల సమాధులు బాబ్రీ మసీదు పరిసరాల్లో ఉన్నాయని, ఈ శ్మశానవాటికను ‘గంజ్‌ షాహిదాన్‌'గా పేర్కొంటారని తెలిపారు. ‘కేంద్రం ధర్మాన్ని విస్మరించింది. ముస్లింల శ్మశానవాటికలో రామాలయ నిర్మాణాన్ని చేపట్టడం ఏమిటన్న ప్రశ్నలను పట్టించుకోవడంలేదు. ముస్లింల సమాధులపై రామాలయ నిర్మాణాన్ని చేపట్టవచ్చా? ఇందుకు ‘సనాతన ధర్మం’ అనుమతిస్తుందా? అన్నది మీరు పరిశీలించండి. ఆ మేరకు ట్రస్ట్‌ నిర్వాహకులు నిర్ణయం తీసుకోవాలి’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.


logo