ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 03:04:52

గరిష్ఠ స్థాయి దాటిపోయింది!

గరిష్ఠ స్థాయి దాటిపోయింది!

  • ఢిల్లీ, పుణె, న్యూయార్క్‌ల్లో క్రమంగా కేసుల తగ్గుదల

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ఉద్ధృతి భారత్‌లోనూ కొనసాగుతున్నది. దేశంలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నప్పటికీ, ప్రధాన నగరాల్లో కేసులు గరిష్ఠ స్థాయి (పీక్‌ స్టేజ్‌)ను దాటడం ఊరటను కలిగిస్తున్నది. ఈ జాబితాలో ఢిల్లీ, పుణె, ముంబై తదితర నగరాలు ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో జూన్‌ రెండో వారంలో రోజుకు సగటున 5 వేల కేసులు నమోదయ్యాయి. అయితే గత వారం రోజులుగా సగటున కొత్త కేసుల సంఖ్య వెయ్యిని దాటడం లేదు. మహారాష్ట్ర రాజధాని ముంబై, అదే రాష్ట్రంలోని మరో నగరం పుణెలో కూడా గతంలో నమోదైన కేసుల సరళి, ప్రస్తుతం నమోదవుతున్న కేసుల సరాసరిని బట్టి చూస్తే ఆయా నగరాల్లో వైరస్‌ పీక్‌ స్టేజ్‌ని దాటిపోయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే, అమెరికాలోని న్యూయార్క్‌, రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌, ఆస్ట్రేలియాలోని సిడ్నీ తదితర నగరాల్లో కూడా ఇంచుమించూ ఇవే పరిస్థితులు నెలకొన్నట్టు చెబుతున్నారు.logo