శనివారం 05 డిసెంబర్ 2020
National - Oct 08, 2020 , 12:04:46

భారత్‌ను పెట్టుబడులకు గమ్యస్థానంగా చూడాలి : కేంద్రమంత్రి

భారత్‌ను పెట్టుబడులకు గమ్యస్థానంగా చూడాలి : కేంద్రమంత్రి

న్యూఢిల్లీ : అమెరికా వ్యాపారాలు భారత్‌ను తమ తదుపరి పెట్టుబడుల గమ్యస్థానంగా చూడాలని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. గ్లోబల్ ఫైనాన్షియల్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్‌ లీడర్‌షిప్‌పై ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ యూఎస్‌ఏ సమ్మిట్‌లో బుధవారం ప్రసంగించారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో 500 బిలియన్ అమెరికన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యం ‘గణనీయంగా చేయదగినది’.  ‘మేం రెడ్ టేప్ నుంచి రెడ్ కార్పెట్‌కు మారుతున్నాం. మేం గత సంకెళ్ల నుంచి మరింత బహిరంగ, ఉదారమైన విదేశీ పెట్టుబడుల గమ్యస్థానానికి మారుతున్నాం’ అని ఆయన అన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2017లో 126 బిలియన్ల అమెరికన్ డాలర్ల నుంచి 2019లో 145 బిలియన్ డాలర్లకు పెరిగిందన్నారు.

అమెరికా పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు.. లాజిస్టిక్స్ ఖర్చును తగ్గించడం, అనేక పన్ను సంస్కరణలు చేయడానికి భారతదేశం లాజిస్టిక్స్ సంస్కరణలు తెస్తుందన్నారు. ‘మా వద్ద దివాలా చట్టాలున్నాయి. భారతదేశంలో కార్పొరేట్ పన్ను అనేది ప్రపంచంలో అతి తక్కువ. నా మంత్రిత్వ శాఖ ‘ప్లగ్ అండ్ ప్లే’, క్లస్టర్ డెవలప్‌మెంట్‌లో పని చేస్తోంది. మేం నిజమైన సింగిల్ విండో వ్యవస్థను చూస్తున్నాం. ఇది కంపెనీలు, వ్యాపారాలు భారతదేశంలో పనిచేయడానికి సులభతరం చేస్తుంది. వేగవంతమైన రిజిస్ట్రేషన్, మౌలిక సదుపాయాల లభ్యతను సులభతరం చేస్తామని వాగ్దానం చేస్తున్నాం’ అని మంత్రి పేర్కొన్నారు. అలాగే మూడో ‘భారత్-యూఎస్ 2ప్లస్‌2 డైలాగ్’ అక్టోబర్ 26, 27న జరిగే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.