మంగళవారం 14 జూలై 2020
National - Jun 17, 2020 , 16:59:58

అమర జవాన్ల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం : మమతా బెనర్జీ

అమర జవాన్ల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం : మమతా బెనర్జీ

కోల్‌కతా : లఢక్‌లోని గాల్వాన్‌ లోయలో భారత్‌, చైనా సైనికుల మధ్య మంగళవారం జరిగిన ముఖాముఖి ఘర్షణలో 20 సైనికులు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. పశ్చిమబెంగాల్‌కు చెందిన సిపాయి రాజేశ్‌ ఓరాంగ్‌, బిపుల్‌ రాయ్‌(జనరల్‌ డ్యూటీ) ఈ ఘర్షణలో అమరులయ్యారు. దీనిపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ అమర జవాన్ల కుటుంబాలకు తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ట్విట్టర్‌ ద్వారా మమతా బెనర్జీ స్పందిస్తూ... అమర జవాన్ల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామన్నారు. అదేవిధంగా కుటుంబానికి నష్టపరిహారంగా రూ. 5 లక్షలు అందజేయనున్నట్లు తెలిపారు. దేశం కోసం వారు చేసిన త్యాగానికి విలువ కట్టలేమన్నారు. ఆ కుటుంబాలకు జరిగిన నష్టాన్ని పూడ్చలేమన్నారు. కష్టసమయంలో కనీసం ఈ భూమి పుత్రుల కుటుంబాలకు అండగా ఉందామన్నారు. 


logo