మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 12, 2020 , 17:25:06

త్వ‌ర‌లో పార్ల‌మెంట్ మాన్‌సూన్ సెష‌న్‌: కేంద్ర‌మంత్రి

త్వ‌ర‌లో పార్ల‌మెంట్ మాన్‌సూన్ సెష‌న్‌: కేంద్ర‌మంత్రి

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌ర‌ణ నేప‌థ్యంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జ‌రుగుతాయా లేదా అనే విష‌యంలో సందిగ్ధ‌త నెల‌కొన్న‌ది. ఈ నేప‌థ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆదివారం పార్ల‌మెంట్ మాన్‌సూన్ సెష‌న్‌పై స్పందించారు. రాజ్యాంగం నిబంధ‌న‌ల ప్ర‌కారం ఆరు నెలల‌లోగా పార్లమెంటు సమావేశాలు నిర్వహించాల్సి ఉందని, ప్రభుత్వం తప్పనిసరిగా తన బాధ్యతను నెరవేరుస్తుందని ఆయ‌న చెప్పారు. 

కరోనా క‌ట్ట‌డిపై రూపొందించుకున్న మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఉల్లంఘించ‌కుండానే పార్లమెంటు వ‌ర్షాకాల‌ సమావేశాలను నిర్వ‌హించ‌డం ఎలా అనే విష‌యంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ వెంక‌య్య‌నాయుడు మధ్య ఒక సమావేశం కూడా జరిగింద‌ని మేఘ్వాల్ తెలిపారు. ఈ మేర‌కు వారు నిబంధనలను రూపొందించారని, త్వరలోనే వాటిని వెల్ల‌డిస్తార‌ని చెప్పారు. ఇప్పటికే సన్నాహకాలు జరుగుతున్నందున త్వరలేనే పార్లమెంటు సమావేశాలు జరుగుతాయని కేంద్రమంత్రి చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo