శుక్రవారం 04 డిసెంబర్ 2020
National - Oct 24, 2020 , 15:08:19

చ‌క్ర‌వ‌డ్డీ మాఫీ చేస్తూ కేంద్రం నిర్ణ‌యం

చ‌క్ర‌వ‌డ్డీ మాఫీ చేస్తూ కేంద్రం నిర్ణ‌యం

ఢిల్లీ : మార‌టోరియం కాలానికి రుణాల‌పై చ‌క్ర‌వ‌డ్డీ మాఫీ చేస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. రూ. 2 కోట్ల వ‌ర‌కు రుణాల‌పై చ‌క్ర‌వ‌డ్డీ మాఫీ చేస్తున్న‌ట్లు కేంద్రం ప్ర‌క‌టించింది. చ‌క్ర‌వ‌డ్డీని మాఫీ చేస్తూ కేంద్రం మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది. 2020 మార్చి 1వ తేదీ నుంచి ఆగ‌స్టు 31 మ‌ధ్య కాలానికి చ‌క్ర‌వ‌డ్డీ మాఫీ వ‌ర్తించ‌నుంది. వీలైనంత త్వ‌ర‌గా మాఫీ చేయాల‌ని ఈ నెల 14న సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు చ‌క్ర‌వ‌డ్డీని మాఫీ చేస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. సాధార‌ణ వ‌డ్డీకి, చ‌క్ర‌వ‌డ్డీకి మ‌ధ్య తేడా న‌గ‌దును రుణ‌గ్ర‌హీత ఖాతాలో వేయాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది. రుణ గ్ర‌హీత‌ల‌కు చెల్లించే మొత్తాన్ని బ్యాంకుల‌కు కేంద్రం చెల్లించ‌నుంది. స‌ద‌రు రుణ‌ఖాతా ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 29 నాటికి నిర‌ర్ధ‌క ఆస్తిగా ప్ర‌క‌టించి ఉండ‌రాదు అని తెలిపింది. చ‌క్ర‌వ‌డ్డీ మాఫీతో కేంద్ర ప్ర‌భుత్వ ఖ‌జానాపై రూ. 6,500 కోట్ల భారం ప‌డ‌నుంది.