శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 16, 2020 , 12:57:55

‘డాడీస్‌ గర్ల్‌' సంబోధన సరికాదు!

‘డాడీస్‌ గర్ల్‌' సంబోధన సరికాదు!

జమ్ము, ఫిబ్రవరి 15: వివాదాస్పద ‘ప్రజా భద్రతా చట్టం’ కింద కశ్మీర్‌లో పలువురు రాజకీయ నాయకులను నిర్బంధించడాన్ని జమ్ముకశ్మీర్‌ డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌ సమర్థించుకున్నారు. అయితే ప్రభుత్వ వివరణ పత్రంలో మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని ‘డాడీస్‌ గర్ల్‌' (నాన్న కూచీ) అని సంబోధించడాన్ని ఆయన తప్పుబట్టారు. అలాంటి పదాలు వాడాల్సింది కాదన్నారు. పీఎస్‌ఏ చట్టం కింద ముఫ్తీని ఎందుకు నిర్బంధించారో వివరిస్తూ జమ్ముకశ్మీర్‌ అధికార యంత్రాంగం వివరణ పత్రం రూపొందించింది. మెహబూబా ముఫ్తీ జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని, యూఏపీఏ కింద నిషేధించిన జమాతే ఇస్లామియా వంటి సంస్థలకు మద్దతు తెలిపారని అందులో వివరించారు. జనసామాన్యం ఆమెను డాడీస్‌ గర్ల్‌, కోటా రాణి అని పిలుస్తారని పేర్కొన్నారు. ముఫ్తీ తండ్రి ముఫ్తీ మొహమ్మద్‌ సయీద్‌ కూడా జమ్ముకశ్మీర్‌కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాగా, వివరణ పత్రాన్ని రూపొందించిన అధికారిని మందలించినట్లు తెలిసింది. అలాగే ఇలాంటి భాష వాడడంపై అడ్వైజరీ కూడా జారీచేసినట్లు సమాచారం. 


logo