శుక్రవారం 22 జనవరి 2021
National - Dec 03, 2020 , 21:39:41

ఆర్మీలో రెండు ఉన్నతస్థాయి పోస్టులకు కేంద్రం అనుమతి

ఆర్మీలో రెండు ఉన్నతస్థాయి పోస్టులకు కేంద్రం అనుమతి

న్యూఢిల్లీ: ఆర్మీలో రెండు ఉన్నతస్థాయి పోస్టుల రూప కల్పనకు కేంద్ర ప్రభుత్వం గురువారం అనుమతి ఇచ్చింది. ఆర్మీ ప్రధాన కార్యాలయం పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నది. కొత్తగా డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (స్ట్రాటజీ) పోస్టును రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి లేఖను గురువారం జారీ చేసింది. ఈ పదవిని చేపట్టే తొలి అధికారి మిలిటరీ ఆపరేషన్స్ డీజీ  లెఫ్టినెంట్ జనరల్ పరమజిత్ సింగ్ కావచ్చిన ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, డైరెక్టర్ జనరల్ ఇన్ఫర్మేషన్ వార్‌ఫేర్‌ అనే కొత్త పోస్ట్‌ను కూడా ప్రభుత్వం సృష్టించింది. డీజీఐడబ్ల్యూ కింద అదనపు డైరెక్టర్ జనరల్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ అధికారి ఉంటారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి


logo