శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 14, 2020 , 02:40:52

దివంగతనేత జయంతి సందర్భంగా కేంద్రం నిర్ణయం

దివంగతనేత జయంతి సందర్భంగా కేంద్రం నిర్ణయం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: విదేశీ వ్యవహారాలకు సంబంధించిన రెండు ప్రముఖ సంస్థల పేర్లను మారుస్తున్నట్టు విదేశాంగ శాఖ గురువారం ప్రకటించింది. శుక్రవారం మాజీ విదేశాంగ మంత్రి, దివంగతనేత సుష్మా స్వరాజ్‌ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని ‘ప్రవాసి భారతీయ కేంద్ర’ను ‘సుష్మాస్వరాజ్‌ భవన్‌'గానూ, ‘ఫారెన్‌ సర్వీస్‌ ఇనిస్టిట్యూట్‌'ను ‘సుష్మాస్వరాజ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెన్‌ సర్వీస్‌'గా మారుస్తున్నట్టు వెల్లడించింది. విదేశాల్లోని భారతీయులకు సుష్మ అందించిన సేవలు, విదేశాంగ మంత్రిగా పనిచేస్తున్నప్పుడు విదేశీ దౌత్యంలో ఆమె అందించిన సహకారానికి గుర్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

logo