సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 18:55:40

జ‌మ్ముక‌శ్మీర్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణయం

జ‌మ్ముక‌శ్మీర్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణయం

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. క‌రోనా నేప‌థ్యంలో రోడ్డు, రైలు, విమాన మార్గాల్లో రాష్ట్రానికి వ‌చ్చే వారికి కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. ప్ర‌యాణికులంతా విధిగా ర్యాపిడ్ యాంటిజెన్ లేదా ఆర్టీ-పీసీఆర్ ప‌రీక్ష చేయించుకోవాల‌ని తెలిపింది. అలాగే రైలు, విమానాల్లో వ‌చ్చే ప్ర‌యాణికుల్లో స‌రైన కాంటాక్ట్ నంబ‌ర్, మొబైల్స్‌లో ఆరోగ్య‌సేతు యాప్ ఉన్న‌వారిని 14 రోజుల‌పాటు లేదా క‌రోనా ప‌రీక్ష‌లో నెగిటివ్ వ‌చ్చినంత వ‌ర‌కు హోం క్వారంటైన్‌లో ఉండాల‌ని పేర్కొంది. ఈ మేర‌కు నిబంధ‌న‌ల‌తో కూడిన ఉత్త‌ర్వుల‌ను గురువారం విడుద‌ల చేసింది.logo