‘గోప్యత’లో మార్పులొద్దు

- ఏకపక్ష నిర్ణయాలు అనుచితం.. అసమ్మతం
- వాట్సాప్‌కు కేంద్ర ప్రభుత్వం ఘాటు లేఖ
- యూజర్ల నుంచి ఎలాంటి సమాచారం
- సేకరిస్తున్నారో తెలుపాలని ఆదేశం
న్యూఢిల్లీ, జనవరి 19: వాట్సాప్ గోప్యత విధానం(ప్రైవసీ పాలసీ)లో ఇటీవల చేసిన మార్పులను ఉపసంహరించుకోవాలని ఆ సంస్థను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఏకపక్ష మార్పులు అనుచితమని, ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టంచేసింది. ఈ మేరకు వాట్సాప్ సీఈవోకి మంగళవారం ఘాటుగా లేఖ రాసింది. వాట్సాప్‌కు ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద మార్కెట్ అని గుర్తుచేసింది. గోప్యత విధానంలో ప్రతిపాదిత మార్పులకు ఆమోదం తెలుపడంపై వినియోగదారులకు ఛాయిస్ ఇవ్వకపోవడం భారత పౌరుల స్వతంత్రతపై ఆందోళనకు దారితీస్తున్నదని తెలిపింది. దేశ పౌరులకు సముచిత గౌరవం ఇవ్వాలని స్పష్టంచేసింది. భారత్‌లో అందిస్తున్న సేవల వివరాలను సమర్పించాలని వాట్సాప్‌ను కేంద్రం ఆదేశించింది. యూజర్ల నుంచి ఎలాంటి సమాచారం సేకరిస్తున్నారు? వేటికి అనుమతులు, సమ్మతి కోరుతున్నారో తెలుపాలని కోరింది. అలాగే భారత్, ఇతర దేశాల్లో గోప్యత విధానంలో ఉన్న తేడాలను వివరించాలని ఆదేశించింది. సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్బుక్ అనుబంధ కంపెనీలతో పంచుకోవటం దేశ ప్రజల సమాచార గోప్యత, భద్రత, స్వతంత్రత హక్కులకు విఘాతం కల్పించటమేనని తెలిపింది.
తమ మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో డేటాను పంచుకునేందుకు వీలుగా వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీని తెచ్చిన విషయం తెలిసిందే. ఈ విధానానికి ఫిబ్రవరి 8లోగా ఆమోదం తెలుపాలని యూజర్లకు గడువు విధించింది. దీనిపై నిరసన వ్యక్తం చేసిన యూజర్లు వాట్సాప్‌ను తొలగించి, ప్రత్యామ్నాయ యాప్‌ల వైపు వెళ్లారు. దీంతో కొత్త పాలసీపై వాట్సాప్ దిగివచ్చింది. దీనిని మే వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.
ఏ డిజిటల్ మాధ్యమమైనా.. అది వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ.. దేశంలో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చు. అయితే దేశ ప్రజల హక్కులకు విఘాతం కలిగించరాదు. వ్యక్తిగత సందేశాల పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉన్నది.
- కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్
తాజావార్తలు
- హై ఫిల్టర్ మాస్క్‌లో పార్లమెంట్‌కు వచ్చిన ఎంపీ నరేంద్ర
- మంత్రి సత్యవతి రాథోడ్‌కు కరోనా పాజిటివ్
- అమానుషం.. ముళ్లపొదల్లో అప్పుడే పుట్టిన ఆడశిశువు
- ఇంధన ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ.. ఒంటి గంట వరకు వాయిదా
- పవర్ ఫుల్ ఉమెన్స్‌తో వకీల్ సాబ్.. పోస్టర్ వైరల్
- భారత్‌కు ఎగువన బ్రహ్మపుత్రపై డ్యామ్స్.. చైనా గ్రీన్‌సిగ్నల్
- మెదక్ జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి
- మెన్స్ డేను కూడా సెలబ్రేట్ చేయాలి : ఎంపీ సోనాల్
- ఉమెన్స్ డే స్పెషల్: విరాట పర్వం నుండి అమెజింగ్ వీడియో
- మునగాలలో అదుపుతప్పి బోల్తాపడ్డ కారు.. మహిళ మృతి