సోమవారం 01 జూన్ 2020
National - May 14, 2020 , 16:53:59

ఇంట్లో వారికి చెప్పకుండానే అంత్యక్రియలు చేసిన సిబ్బంది...

ఇంట్లో వారికి చెప్పకుండానే అంత్యక్రియలు చేసిన సిబ్బంది...

కరోనా వచ్చిన రోగికి చికిత్స అందిస్తున్నారు అనుకున్నారు ఆ రోగి కుటుంబసభ్యులు. కానీ రోగి చనిపోయినా చెప్పకుండానే అంత్యక్రియలు కూడా చేసిన ఘటన జరిగింది పశ్చిమ బెంగాల్‌లో. కలకత్తాకు చెందిన 70 ఏండ్ల హరినాథ్‌ అనే వృద్దునికి గత నెలలో కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తెలియడంతో అక్కడి ప్రభుత్వం అతన్ని చికిత్సకు ఆస్పత్రికి తరలించింది. దీంతో పాటు అతని కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్‌కు పంపారు అధికారులు.

అయితే తమ కుటుంబ సభ్యునికి ప్రస్తుతం ఎలా ఉందో తెలుసుకుందామని ఆ కుటుంబసభ్యులు ఆస్పత్రికి ఫోన్‌ చేసి ఆరా తీసారు. అప్పుడు ఆ ఆస్పత్రి సిబ్బంది చెప్పిన విషయానికి ఆ కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. ఇప్పటికే వృద్దుడు చనిపోయి 5 రోజులు అయిందని, అంత్యక్రియలు కూడా పూర్తి అయ్యాయని వారు చెప్పడంతో కుటుంబ సభ్యులు కనీసం విషయం చెప్పలేదని వాపోయారు. కడసారి చూపు కూడా దక్కకపోవడంతో పాటు అంతా ఉన్నా అనాథ శవంగా వారి ఇంట్లో వ్యక్తి అంత్యక్రియలు జరగడంతో వారు ఎంతో భాదలోకి చేరుకున్నారు. ఈ ఘటన కలకత్తాలోని ఎంఆర్‌ బంగూర్‌ ఆసుపత్రిలో చోటుచేసుకుంది.


logo