మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 11:24:28

డిసెంబర్‌ 31 వరకు ఐటీ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

డిసెంబర్‌ 31 వరకు ఐటీ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

ముంబై:  కరోనా వైరస్‌ వల్ల కంపెనీలు ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి.   చాలా వరకు ఐటీ కంపెనీలు ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేయడానికి  వెసులుబాటు కల్పించాయి.  తాజాగా కేంద్ర ప్రభుత్వం మరోసారి ఐటీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఐటీ, బీపీవో కంపెనీలకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌  విధానాన్ని డిసెంబర్‌ 31 వరకు పొడిగించింది.   భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో  మరికొన్ని  నెలల పాటు 'వర్క్ ఫ్రం హోం'  సౌకర్యాన్ని కేంద్రం పొడిగించింది.  

గతంలో విధించిన గడువు జూలై 31తో ముగుస్తున్నది.  కోవిడ్‌-19 కారణంగా ప్రజల్లో నెలకొన్న భయాందోళనను   దృష్టిలో ఉంచుకొని ఇంటి నుంచి పనిచేసే విధానాన్ని   2020 డిసెంబర్‌ 31 వరకు పొడిగిస్తూ  సర్వీసు ప్రొవైడర్లకు నిబంధనలు, షరతులలో  డాట్‌ సడలింపులు ఇచ్చిందని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ ట్వీట్‌ చేసింది.     భారత్‌లో  ప్రస్తుతం  85శాతం మంది ఐటీ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే అవకాశం  కల్పించారు. చాలా కొద్ది మంది మాత్రమే ఆఫీసులకు వెళ్తున్నారు. 


logo