శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 03:06:54

విమాన టికెట్ల ధరల పరిమితులు పొడిగింపు

విమాన టికెట్ల ధరల పరిమితులు పొడిగింపు

న్యూఢిల్లీ: దేశీయ విమాన టికెట్ల కనిష్ఠ, గరిష్ఠ ధరలపై విధించిన పరిమితులను నవంబర్‌ వరకు పొడిగిస్తున్నట్టు పౌర విమానయాశాఖ తెలిపింది. మే 21న నిర్ణయించిన ప్రకారం ఆగస్టు 24 వరకు టికెట్ల ధరలపై నియంత్రణ ఉన్నది. అయితే, కరోనా వైరస్‌ వ్యాప్తి ఏమాత్రం తగ్గకపోవటంతో నియంత్రణను పొడిగించినట్టు శుక్రవారం విడుదలచేసిన ప్రకటనలో విమానయానశాఖ వెల్లడించింది. లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన దేశీయ విమాన సర్వీసులను దాదాపు రెండు నెలల విరామం తర్వాత మే 25నుంచి ప్రారంభించారు. ప్రయాణ సమయాన్ని బట్టి టికెట్ల కనిష్ఠ, గరిష్ఠ ధరలను డీజీసీఏ నిర్ణయించింది.


logo