సోమవారం 30 మార్చి 2020
National - Mar 21, 2020 , 01:45:36

ప్రభుత్వ రంగ సంస్థలకు కేంద్రం ఆదేశం

ప్రభుత్వ రంగ సంస్థలకు కేంద్రం ఆదేశం

న్యూఢిల్లీ: కరోనా నియంత్రణలో భాగంగా సగం మంది సిబ్బంది ‘ఇంటి వద్ద నుంచే పని’ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. తక్షణం ఈ నిర్ణయాన్ని అమలులోకి తేవాలని శుక్రవారం జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నది. వచ్చేనెల నాలుగో తేదీ వరకు ఇది అమలులో ఉంటుందని వెల్లడించింది. సామాజిక దూరం పాటించేందుకు వీలుగా ఇంటి వద్ద నుంచే పని చేసేందుకు సిబ్బందిని ప్రోత్సహించాలని ప్రైవేట్‌ కంపెనీల యాజమాన్యాలకు కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాలశాఖ సూచించింది. బోర్డు సమావేశాలతోపాటు అన్ని సమావేశాలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించాలని పేర్కొన్నది. ఢిల్లీ పరిధిలోని ప్రైవేట్‌ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసేందుకు యాజమాన్యాలు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. 


logo