శనివారం 23 జనవరి 2021
National - Aug 13, 2020 , 15:20:52

జిల్లా ప‌రిపాల‌నా యంత్రాంగంపై ప్ర‌భుత్వ వైద్యుల ఆగ్ర‌హం

జిల్లా ప‌రిపాల‌నా యంత్రాంగంపై ప్ర‌భుత్వ వైద్యుల ఆగ్ర‌హం

ల‌క్నో : కోవిడ్‌-19తో అద‌న‌పు చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌(ఏసీఎంవో) మృతి నేప‌థ్యంలో వార‌ణాసిలోని ప్ర‌భుత్వ వైద్యులు జిల్లా ప‌రిపాల‌నా యంత్రాంగంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌మ‌ను అన‌వ‌స‌ర ఒత్తిడికి గురిచేస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. మ‌రోవైపు ద‌హ‌న సంస్కారాల నిమిత్తం ఏసీఎంవో కుటుంబ స‌భ్యులకు మ‌రో మృత‌దేహాన్ని అప్ప‌గించ‌డంపై బీహెచ్‌యూ ఆస్ప‌త్రి విచార‌ణ చేప‌ట్టింది. కోవిడ్‌-19 ఇన్‌ఛార్జ్‌లుగా కొన‌సాగుతున్న రూర‌ల్‌, అర్భ‌న్ పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల‌కు చెందిన 24 మందికి పైగా వైద్యాధికారులు రాజీనామాలు స‌మ‌ర్పించారు. మాన‌సిక ఒత్త‌డిలో తాము విధులు నిర్వ‌ర్తించ‌లేమ‌ని తెలిపారు.

వైద్యులంతా క‌లిసి  జిల్లా చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌కు లేఖ రాశారు. టార్గెట్లు పూర్తిచేయ‌క‌పోతే త‌మ‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేస్తామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ బెదిరింపుల‌కు గురిచేస్తున్నార‌న్నారు. కోవిడ్‌-19 మ‌ర‌ణాల‌కు యంత్రాంగం త‌మ‌ను నిందితుల్ని చేస్తుంద‌న్నారు. ఏసీఎంవో జంగ్ బ‌హ‌దూర్ సింగ్ అస‌లు ఏ ప‌రిస్థితుల్లో మ‌ర‌ణించారో తెలియ‌జేయాల‌న్నారు. ఉద్యోగంలోంచి తీసేస్తామ‌ని ప‌రిపాల‌నా యంత్రాంగం డాక్ట‌ర్ సింగ్‌ను బెదిరింపుల‌కు గురిచేశార‌న్నారు. ఆ షాకే త‌న మ‌ర‌ణానికి కార‌ణంగా తాము భావిస్తున్నామ‌న్నారు. కాగా సీఎంవో వీ.బి.సింగ్ నేడు స్పందిస్తూ వైద్యులు త‌మ రాజీనామా లేఖ‌ల‌ను ఉప‌సంహరించుకున్న‌ట్లు తెలిపారు. భావావేశంలో వారు అలా ప్ర‌వ‌ర్తించిన‌ట్లు అంతే త‌ప్పా మ‌రొక‌టి కాద‌న్నారు. ప్ర‌స్తుతం అంద‌రూ విధుల్లో ఉన్న‌ట్లు చెప్పారు.

తాజావార్తలు


logo