శుక్రవారం 05 జూన్ 2020
National - May 14, 2020 , 17:45:00

వీధి వ్యాపారులకు రూ.5 వేల కోట్ల స్పెషల్‌ క్రెడిట్‌

వీధి వ్యాపారులకు రూ.5 వేల కోట్ల స్పెషల్‌ క్రెడిట్‌

న్యూఢిల్లీ:  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మీడియా సమావేశం నిర్వహించారు. రెండో ప్రాధాన్యత రంగాలైన 9 విభాగాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ వివరాలు వెల్లడించారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ రెండో ప్యాకేజీ ప్రకటన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా వీధి వ్యాపారుల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. దీని కోసం వారికి రూ.5వేల కోట్ల ప్రత్యేక రుణ సదుపాయన్ని ప్రకటిస్తున్నాం. ఈ పథకం ఒక నెలలోనే ప్రారంభిస్తున్నాం. స్ట్రీట్‌ వెండర్స్‌కు రూ.10 వేల రుణం ఇస్తాం. ఇది నిర్ణీత మొత్తం కాదు. బ్యాకులతో  సంప్రదింపులు జరిపి దీనిపై నిర్ణయం తీసుకుంటాం. డిజిటల్‌ చెల్లింపులకు ప్రోత్సహాకాలు అందిస్తాం. సక్రమంగా తిరిగి చెల్లిస్తే వర్కింట్‌ క్యాపిటల్‌ క్రెడిట్‌ అందిస్తాం. ఈ పథకం దాదాపు 50 లక్షల మంది వీధి వ్యాపారలుకు లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. 


logo