శుక్రవారం 05 జూన్ 2020
National - Apr 02, 2020 , 01:22:32

జమ్ముకశ్మీర్‌ స్థానికతపై కేంద్రం గెజిట్‌

జమ్ముకశ్మీర్‌ స్థానికతపై కేంద్రం గెజిట్‌

-గ్రూప్‌ 4 ఉద్యోగాల వరకు రిజర్వేషన్‌ వర్తింపు

- కొత్త నిబంధనలపై రాజకీయ పార్టీల మండిపాటు

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌ స్థానికత, ప్రభుత్వ ఉద్యోగాల అర్హతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం బుధవారం గెజిట్‌ విడుదల చేసింది. గ్రూప్‌-4 ఉద్యోగాలకు సమానమైన వేతనంతో కూడిన నియామకాల్లో  స్థానికులకు రిజర్వేషన్‌ వర్తిస్తుందని తెలిపింది. 15 ఏండ్లపాటు నివసించినవారు, స్థానిక విద్యా సంస్థల్లో ఏడేండ్లపాటు విద్యనభ్యసించి పది, ఇంటర్‌ పరీక్షలు రాసినవారు, పదేండ్లపాటు సర్వీసులో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, పునరావాస కమిషనర్‌ వద్ద వలస వ్యక్తిగా నమోదు చేసుకున్నవారు మాత్రమే జమ్ముకశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతంలో స్థానికుల కిందకు వస్తారని పేర్కొంది. జమ్ముకశ్మీర్‌లోని రాజకీయ పార్టీలు దీనిపై మండిపడ్డాయి. కేంద్రం హామీ ఇచ్చిన విధంగా ఇది లేదని, గాయపడిన ప్రజలను మరింత అవమానపరిచేలా ఉన్నదని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్సీ) ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా విమర్శించారు. కొత్త నిబంధనలు కశ్మీర్‌ ప్రజలకు మరిన్ని ఇబ్బందులు సృష్టించేలా ఉన్నాయని పీడీపీ విమర్శించింది. logo