బుధవారం 03 జూన్ 2020
National - Apr 08, 2020 , 22:03:30

ఎఫ్‌సీఐ నుంచి నేరుగా కొనుగోలుకు ఎన్‌జీవోలకు అనుమతి

ఎఫ్‌సీఐ నుంచి నేరుగా కొనుగోలుకు ఎన్‌జీవోలకు అనుమతి

ఢిల్లీ : దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలకు ఆహారం అందించేందుకు ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌సీఐ) నుంచి గోధుమలు, ధాన్యం నేరుగా కొనుగోలు చేసేందుకు స్వచ్చంధ సంస్థలు, సేవా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి తెలిపింది. ఈ-ఆక్షన్‌ విధానాన్ని అనుసరించాల్సిన అవసరం లేదని వెల్లడించింది. లాక్‌డౌన్‌లో రాష్ర్టాలకు 10 లక్షల టన్నుల ఆహార పదార్థాలు ఇచ్చినట్లుగా కేంద్రం పేర్కొంది. 2.2 మిలియన్‌ టన్నులు నిల్వ ఎక్కువున్న రాష్ర్టాల నుంచి సరఫరా చేసినట్లు వెల్లడించింది. ఏ రాష్ట్రంలో ఆహార నిల్వలు ఎంతున్నాయో సమీక్షిస్తున్నట్లు తెలిపింది. ధరలు పెరగకుండా, ఆహార పదార్థాల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.


logo