సోమవారం 30 నవంబర్ 2020
National - Nov 11, 2020 , 21:59:55

ఇక 70 శాతం సామర్థ్యంతో విమానయాన సంస్థల సేవలు

ఇక 70 శాతం సామర్థ్యంతో విమానయాన సంస్థల సేవలు

న్యూఢిల్లీ: దేశీయ విమానయాన సంస్థలు ఇకపై 70 శాతం సామర్థ్యంతో పని చేయనున్నాయి. కరోనా అనంతరం దేశీయ విమాన ప్రయాణాలు పునరుద్ధరణ కాగా ఇప్పటి వరకు 60 శాతం సామర్థ్యంతో విమానయాన సంస్థలు సేవలందిస్తున్నాయి. అయితే కేంద్ర పౌర విమాన మంత్రిత్వ శాఖ బుధవారం దీనిని 70 శాతానికి పెంచింది. దేశంలో కరోనా కేసుల తీవ్రత తగ్గుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నది. 

మే 25 నుంచి దేశీయ విమాన ప్రయాణాలను పునరుద్ధరించగా తొలి రోజు 30 వేల మంది ప్రయాణించగా నవంబర్‌ 8 నాటికి ఈ సంఖ్య 2.06 లక్షలకు చేరినట్లు కేంద్ర పౌర విమాన మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. తొలుత మూడో వంతు సామర్థ్యం వరకు సేవలందించేందుకు విమానయాన సంస్థలను అనుమతించగా అనంతరం దీనిని 45 శాతం, ఆ తర్వాత 60 శాతానికి పెంచినట్లు తెలిపారు. తాజాగా 70 శాతం సామర్థ్యం మేర పని చేసేందుకు విమానయాన సంస్థలకు అనుమతించినట్లు హర్దీప్ సింగ్ చెప్పారు.