మంగళవారం 07 జూలై 2020
National - Jun 22, 2020 , 14:14:32

నిల‌క‌డ‌గా మ‌ధ్య‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ ఆరోగ్యం

నిల‌క‌డ‌గా మ‌ధ్య‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ ఆరోగ్యం

భోపాల్ : మ‌ధ్య‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ లాల్జి టాండ‌న్(85) ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు మేదాంత హాస్పిట‌ల్ డైరెక్ట‌ర్ రాకేశ్ కపూర్ మీడియాకు తెలిపారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం మెరుగు ప‌డుతుంద‌న్నారు. జూన్ 11వ తేదీన గ‌వ‌ర్న‌ర్ కు శ్వాస, మూత్ర‌ సంబంధ స‌మ‌స్య‌లతో పాటు జ్వ‌రం వ‌చ్చింది. దీంతో అదే రోజు ఆయ‌న‌ను మేదాంత ఆస్ప‌త్రిలో చేర్పించి చికిత్స అందించారు.

గ‌వ‌ర్న‌ర్ కిడ్నీ, లివ‌ర్ ఫంక్ష‌న్ స‌రిగ్గానే ఉంద‌ని వైద్యులు తెలిపారు. ప్ర‌స్తుతం వెంటిలేట‌ర్ పై చికిత్స పొందుతున్నార‌ని పేర్కొన్నారు. ఆయ‌న‌కు ఊపిరితిత్తుల స‌మ‌స్య స్వ‌ల్పంగా ఉంద‌న్నారు. ఆ స‌మ‌స్య‌పై దృష్టి సారించిన‌ట్లు డాక్ట‌ర్లు స్ప‌ష్టం చేశారు. 


logo