సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 16, 2020 , 15:37:55

అక్కడ పని చేసే గవర్నర్లు వైన్‌ తాగి, గోల్ఫ్‌ ఆడుతారు..

అక్కడ పని చేసే గవర్నర్లు వైన్‌ తాగి, గోల్ఫ్‌ ఆడుతారు..

లక్నో : గోవా గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ల వ్యవస్థను దెబ్బతీసే విధంగా ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పాట్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో గోవా గవర్నర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యపాల్‌ మాలిక్‌ మాట్లాడుతూ.. ఈ దేశంలోని గవర్నర్లకు పెద్ద పనేం ఉండదన్నారు. జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌గా పని చేసే వారు వైన్‌ తాగి, గోల్ఫ్‌ ఆడుతారని పేర్కొన్నారు. సత్యపాల్‌ మాలిక్‌ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చానీయాంశమయ్యాయి. గోవా గవర్నర్‌ నియామకం కంటే ముందు.. సత్యపాల్‌ మాలిక్‌ జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌గా పని చేశారు. 


logo