గురువారం 03 డిసెంబర్ 2020
National - Oct 22, 2020 , 12:25:53

చైనాలో లేహ్‌‌.. ట్విట్ట‌ర్‌కు వార్నింగ్‌

చైనాలో లేహ్‌‌.. ట్విట్ట‌ర్‌కు వార్నింగ్‌

హైద‌రాబాద్‌: ల‌డాఖ్‌లోని లేహ్‌.. చైనాలో ఉన్న‌ట్లు సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ అకౌంట్ సెట్టింగ్స్‌లో ఉన్న‌ది.  దీని ప‌ట్ల కేంద్ర ప్ర‌భుత్వం త‌న అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది.  ట్విట్ట‌ర్ సీఈవో జాక్ డోర్సీకి ఈ నేప‌థ్యంలో వార్నింగ్ కూడా ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.  సున్నిత‌మైన అంశాల‌ను గౌర‌వించాల‌ని ట్విట్ట‌ర్ సంస్థ‌ను భార‌త ప్ర‌భుత్వం కోరింది.  గ‌త ఏడాది ల‌డాఖ్‌ను భార‌త ప్ర‌భుత్వం కేంద్ర పాలిత ప్రాంతంగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.అయితే ఇటీవ‌ల ల‌డాఖ్ స‌రిహ‌ద్దుల్లో చైనాతో స‌రిహ‌ద్దు వివాదం ఉత్ప‌న్న‌మైంది. జూన్ 15న జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో 20 మంది భార‌తీయ సైనికులు మృతిచెందారు.  లేహ్‌లో ప‌లు ప్రాంతాల్లో భార‌తీయ ద‌ళాల‌ ఫార్వ‌ర్డ్ పోస్టులు ఉన్నాయి.  ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్‌తో పాటు త్రివిధ ద‌ళాల చీఫ్‌లు కూడా లేహ్ ఫార్వ‌ర్డ్ పోస్టుల‌ను సంద‌ర్శించిన విష‌యం తెలిసిందే.  ట్విట్ట‌ర్ సెట్టింగ్స్‌లో లేహ్ ప్రాంతాన్ని చైనాలో ఉన్న‌ట్లు చూపించ‌డం శోచ‌నీయం. ఎల‌క్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ‌శాఖ ఈ నేప‌థ్యంలో ట్విట్ట‌ర్ సీఈవో జాక్ డోర్సీకి లేఖ రాసింది.  భార‌తీయ భౌగోళిక మ్యాప్‌ను త‌ప్పుడుగా చూపిస్తున్నార‌ని ఆ లేఖ‌లో ట్విట్ట‌ర్ ప‌ట్ల విముఖ‌త వ్య‌క్తం చేసింది. ఐటీశాక కార్య‌ద‌ర్శి అజ‌య్ సాహానే ఈ లేఖ రాశారు. ఇలాంటి ప్ర‌య‌త్నాల వ‌ల్ల ట్విట్ట‌ర్ సంస్థ‌కు చెడు పేరు వ‌స్తుంద‌ని, దాని విశ్వ‌స‌నీయ‌త‌పైన కూడా అనుమానాలు వ్య‌క్తం అవుతాయ‌న్నారు.  ప్ర‌భుత్వ నిర్ణ‌యం ప‌ట్ల ట్విట్ట‌ర్ సంస్థ స్పందించింది.  భార‌త ప్ర‌భుత్వంతో ప‌నిచేసేందుకు క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు ట్విట్ట‌ర్ ప్ర‌తినిధి ఒక‌రు తెలిపారు. సున్నిత‌మైన అంశాల‌ను గుర్తిస్తామ‌ని, లేఖ‌ను అందుకున్న‌ట్లు చెప్పారు. ఆదివారం చోటుచేసుకున్న సాంకేతిక స‌మ‌స్య‌ను గుర్తించామ‌న్నారు. జియోట్యాగ్ స‌మ‌స్య‌ను వెంట‌నే గుర్తించి ప‌రిష్క‌రించామ‌న్నారు.