గురువారం 03 డిసెంబర్ 2020
National - Oct 31, 2020 , 14:36:58

‘ప్రభుత్వ వాహనాలను బంగారం అక్రమ రవాణాకు వాడుతున్నారు’

‘ప్రభుత్వ వాహనాలను బంగారం అక్రమ రవాణాకు వాడుతున్నారు’

తిరువనంతపురం : కేరళ రాష్ట్రంలోని చాలా ప్రభుత్వ శాఖల వాహనాలను బంగారం అక్రమ రవాణాకు వాడుతున్నారని ఆ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్ర ఆరోపించారు. క్రీడల సంఘం అధ్యక్షుడి కారును ఇందు కోసమే ప్రత్యేకంగా వినియోగిస్తున్నారని అన్నారు. స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ మెర్సీ కుట్టన్‌కు హవాలా లావాదేవీలు, బినామీ ఆస్తులున్నాయని ఆయన ఆక్షేపించారు.

కేరళ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని సురేంద్ర డిమాండ్‌ చేశారు. ఇదిలాఉండగా రాష్ట్రంలోని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) దౌత్య కార్యాలయానికి చెందిన పార్శిల్‌లో రూ. 15 కోట్ల విలువైన 30 కిలోల బంగారాన్ని జూన్‌ 4న విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో యూఏఈ కార్యాలయం ఉద్యోగితోపాటు కేరళ ప్రభుత్వ ఐటీశాఖలోని మహిళా ఉద్యోగిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం ప్రధాన కార్యదర్శిపై కూడా ఆరోపణలు రావడంతో ఆయన్ను పదివి నుంచి తొలగించిన విషయం విదితమే. చూడండి..మోతాదు మించితే విషమే.. వీడియో 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.