మంగళవారం 26 మే 2020
National - May 09, 2020 , 20:09:04

వ‌ల‌స కూలీల జాతీయ ప‌ట్టిక త‌యారు చేస్తున్న కేంద్రం..

వ‌ల‌స కూలీల జాతీయ ప‌ట్టిక త‌యారు చేస్తున్న కేంద్రం..

హైద‌రాబాద్: వ‌ల‌స కూలీల‌కు సంబంధించి కేంద్ర కార్మిక శాఖ జాతీయ ప‌ట్టిక‌ను త‌యారు చేస్తున్న‌ది.  ఆ జాబితాలో వ‌ల‌స కార్మికుల స‌మ‌గ్ర స‌మాచారాన్ని ఉంచ‌నున్నారు.  జాతీయ ప‌ట్టిక కోసం అన్ని రాష్ట్రాల నుంచి వ‌ల‌స కూలీల డేటాను సేక‌రిస్తున్నామ‌ని కార్మిక శాఖ కార్య‌ద‌ర్శి హీరాలాల్ స‌మ‌రియా తెలిపారు.  కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వ‌ర్ .. ఈ అంశంపై కార్మిక సంఘాల‌తో చ‌ర్చించిన‌ట్లు తెలుస్తున్న‌ది. విప్ల‌వాత్మ‌క‌ కార్మిక సంస్క‌ర‌ణ‌ల‌ను ఇప్ప‌ట్లో అమ‌లు చేయ‌మ‌న్నారు. కోవిడ్ సంక్షోభం వెళ్లేంత వ‌ర‌కు కార్మికుల‌పై ఎటువంటి చ‌ర్య‌లు ఉండ‌వ‌న్నారు.  అయితే చాలా చోట్ల జీతాల కోత విధించ‌డం వ‌ల్ల కార్మికులంతా వ‌ల‌స వెళ్తున్న‌ట్లు కార్మిక సంఘాలు చెబుతున్నాయి. గుజ‌రాత్ లాంటి రాష్ట్రంలో ప‌ని గంట‌ల‌ను పెంచ‌డం వ‌ల్ల కూడా కార్మికులు వెనుదిరుగుతున్న‌ట్లు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. వ‌ల‌స కూలీల డేటాతో ఓ మొబైల్ అప్లికేష‌న్ త‌యారు చేయ‌నున్నారు. బీహార్ లాంటి రాష్ట్రానికి సుమారు 9 ల‌క్ష‌ల మంది వ‌ల‌స కూలీలు వాప‌స్ రానున్నారు. అలాంటి వారికి మ‌ళ్లీ ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించ‌డం ఆ రాష్ట్రానికి ఇబ్బంది అవుతుంది. అయితే వ‌ల‌స కూలీల డేటాతో ఆ స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌వ‌చ్చు అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.logo