మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Oct 31, 2020 , 13:03:22

ఉల్లి సరఫరాకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

 ఉల్లి సరఫరాకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

ఢిల్లీ : ఉల్లి సరఫరాకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అందులోభాగంగానే ఉల్లిపాయల ఎగుమతిపై  సెప్టెంబర్ 14తేదీ నుండి నిషేధం విధించామని డి.జి.ఎఫ్.‌టి.  ప్రయివేటు ఏజెన్సీ ల ద్వారా దిగుమతులను చేపడుతోందని ఆయన చెప్పారు. నిత్యావసర వస్తువుల చట్టం కింద అక్టోబర్ 23 నుంచి ఉల్లిపాయల నిల్వ పరిమితిని, టోకు వ్యాపారులకు 25 మెట్రిక్ టన్నుల చొప్పున , చిల్లర వ్యాపారులకు 2 మెట్రిక్ టన్నుల చొప్పున విధించడం జరిగిందన్నారు.

అంతేకాదు ఉల్లి గింజల ఎగుమతిని కూడా నిషేధించడం జరిగింది. పెరుగుతున్న ఉల్లిపాయల ధరలను దృష్టిలో ఉంచుకుని, ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా, మిగులు నిల్వల నుండి ఉల్లిపాయలను సరఫరా చేయడం జరుగుతుందని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ పంట కాలంలో రికార్డు స్థాయిలో 742 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించడానికి, భారత ఆహార సంస్థ ,రాష్ట్ర ఏజెన్సీలు, సిద్ధంగా ఉన్నాయి. 

గత ఏడాది ఇదే కాలంలో ఈ సంస్థలు 627 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించాయి.  అదే విధంగా, 2020-21 ఖరీఫ్ సీజను కోసం విక్రయకేంద్రాల సంఖ్యను కూడా  30,709 నుంచి39,122 కి పెంచడం జరిగింది.  మార్కెట్లో వరి ముందుగా రావడంతో, వరి సేకరణ ప్రక్రియ సెప్టెంబర్ 26నుంచి జరిగిందని ఆయన పేర్కొన్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.