శుక్రవారం 05 జూన్ 2020
National - May 14, 2020 , 12:56:22

ఏడాదిలో 15 రోజులు.. వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్: కేంద్రం

ఏడాదిలో 15 రోజులు.. వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్:  కేంద్రం

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో .. వ‌ర్కింగ్ రూల్స్ మారుతున్న విష‌యం తెలిసిందే. ఈ దిశ‌గానే కేంద్ర ప్ర‌భుత్వం కూడా త‌మ ఉద్యోగుల విష‌యంలో కొన్ని మార్పులు చేయ‌నున్న‌ది.  ఏడాదిలో 15 రోజుల పాటు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌ను అమ‌లు చేయాల‌ని కేంద్రం భావిస్తున్న‌ది. దీనికి సంబంధించి సిబ్బంది వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ‌ ప్ర‌ణాళిక త‌యారు చేస్తున్న‌ది. సోష‌ల్ డిస్టాన్సింగ్ అమ‌లు చేసేందుకు ఈ ప్ర‌క్రియ త‌ప్ప‌దు అన్న‌ట్లుగా కేంద్రం ఓ ఆలోచ‌న‌లో ఉన్న‌ది. అన్ని శాఖ‌ల్లోనూ ఈ-ఆఫీసుల‌ను ఏర్పాటు చేయాల‌ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప‌ర్స‌న‌ల్ అండ్ ట్రైనింగ్ పేర్కొన్న‌ది. దాదాపు 75 మంత్రిత్వ‌శాఖ‌లు ఇప్ప‌టికే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాంలో ప‌నిచేస్తున్నాయి. మ‌రో 57 శాఖ‌లు త‌మ ఆఫీసుల‌ను ఈ-ఆఫీసులుగా మార్చే ప‌నిలో నిమ‌గ్నం అయ్యాయి. ప్ర‌స్తుతం కేంద్ర‌ ప్ర‌భుత్వ ఉద్యోగులు సుమారు 48.34 ల‌క్ష‌ల మంది ఉన్నారు.      


logo