శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 07, 2020 , 18:50:03

చారిత్రక నిర్ణయం తీసుకోనున్న కేరళ ప్రభుత్వం..

చారిత్రక నిర్ణయం తీసుకోనున్న కేరళ ప్రభుత్వం..

తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకోనున్నది. కులాంతర వివాహాలు చేసుకున్న దంపతులకు ప్రభుత్వం.. సంవత్సరం పాటు భద్రత, వసతి కల్పించనున్నది. కేరళ వైద్యారోగ్య శాఖ మంత్రి కే.కే.శైలజ మాట్లాడుతూ.. ఎవరైతే.. ఇరు కుటుంబాల పెద్దలు ఆమోదించని ‘ప్రేమికులు’.. కులాంతర వివాహాలు చేసుకుంటారో, వారి కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సన్నాహాలు చేస్తుందన్నారు. వివాహానంతరం, నూతన దంపతులకు ఉండడానికి స్థోమత లేని యెడల వారికి ప్రభుత్వమే వసతి కల్పించి, కావాల్సిన సౌకర్యాలన్నీ ఉచితంగా కల్పిస్తుందని మంత్రి తెలిపారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు మంత్రి శైలజ పేర్కొన్నారు. 


logo