శుక్రవారం 15 జనవరి 2021
National - Dec 01, 2020 , 19:00:17

దేశంలో అంద‌రికీ వ్యాక్సిన్ ఇస్తామ‌ని ఎప్పుడూ చెప్ప‌లేదు: కేంద్రం

దేశంలో అంద‌రికీ వ్యాక్సిన్ ఇస్తామ‌ని ఎప్పుడూ చెప్ప‌లేదు: కేంద్రం

న్యూఢిల్లీ: దేశంలో ఉన్న ప్ర‌జ‌లంద‌రికీ క‌రోనా వ్యాక్సిన్ ఇస్తామ‌ని ఎప్పుడూ చెప్ప‌లేద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడిన కేంద్ర ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి రాజేష్ భూష‌ణ్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. నేను ఒక్క విష‌యం మాత్రం స్ప‌ష్టం చేయ‌ద‌ల‌చుకున్నాను. దేశంలోని జ‌నాభా మొత్తానికి వాక్సినేటింగ్ చేస్తామ‌ని ప్ర‌భుత్వం ఎప్పుడూ చెప్ప‌లేదు. ఇలాంటి శాస్త్రీయ సంబంధ అంశాల‌ను వాస్త‌విక స‌మాచారం ఆధారంగానే చ‌ర్చించాల‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాలి అని ఆయ‌న అన్నారు. దేశంలో ప్ర‌తి ప‌ది ల‌క్ష‌ల మందికి కేవ‌లం 211 మందికి మాత్ర‌మే కరోనా సోకింద‌ని.. పెద్ద దేశాల‌తో పోలిస్తే ప్ర‌తి మిలియ‌న్ కేసుల సంఖ్య ఇండియాలోనే త‌క్కువ‌ని రాజేష్‌భూష‌ణ్ తెలిపారు.