ఆదివారం 24 జనవరి 2021
National - Dec 21, 2020 , 15:46:00

త్వ‌ర‌లోనే సీర‌మ్ నుంచి 5 కోట్ల వ్యాక్సిన్లు కొనుగోలు!

త్వ‌ర‌లోనే సీర‌మ్ నుంచి 5 కోట్ల వ్యాక్సిన్లు కొనుగోలు!

న్యూఢిల్లీ: భార‌త ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి 5 కోట్ల ఆక్స్‌ఫ‌ర్డ్ వ్యాక్సిన్ల‌ను కొనుగోలు చేయ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఒక‌టి, రెండు రోజుల్లో ఈ వ్యాక్సిన్‌కు భార‌త ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. యూకే మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రోడ‌క్ట్స్ రెగ్యులేట‌రీ ఏజెన్సీ ఆమోదం త‌ర్వాత ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చే అవ‌కాశం ఉంది. సీర‌మ్ నుంచి వ్యాక్సిన్ల‌ను సేక‌రించిన త‌ర్వాత జ‌న‌వ‌రిలో వాటిని రాష్ట్రాల‌కు పంపిణీ చేయ‌నున్న‌ది. వ‌చ్చే నెల నుంచే దేశంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. తొలి ద‌శ‌లో భాగంగా ఎవ‌రికి వ్యాక్సిన్ ఇవ్వాలో రాష్ట్రాలు జాబితా త‌యారు చేయాల‌ని ఇప్పటికే కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 

ఇవి కూడా చదవండి..

హ్యంగోవర్ నుంచి తప్పించుకునే మార్గాలు తెలుసా?
ఒక్కసారిగా ఆపేస్తే ఆరోగ్యానికి ప్రమాదమే..!

జ్వరం వచ్చినప్పుడు తినకూడని ఆహార పదార్థాలేంటి..?

శృంగారానికి ముందు ఇవి తిన్నారంటే ఇరగదీస్తారు!

వెల్లుల్లితో లైంగిక సమస్యలు దూరమవుతాయా..?

వ్యాక్సిన్లు.. వాటి పుట్టుక.. కొన్ని నిజాలు!
శృంగారం వల్ల కలిగే ప్రయోజనాలివే..

గాడిద పాలు ఆరోగ్యానికి మంచివేనా ?


logo