శనివారం 23 జనవరి 2021
National - Dec 24, 2020 , 13:00:01

అహానికిపోయి ఇరుక్కున్న కేంద్ర ప్ర‌భుత్వం..

అహానికిపోయి ఇరుక్కున్న కేంద్ర ప్ర‌భుత్వం..

న్యూఢిల్లీ: నూత‌న వ‌్య‌వ‌సాయ చ‌ట్టాల విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం అహంభావంతో వ్య‌వ‌హ‌రిస్తున్నద‌ని, ఇప్పుడు పూర్తిగా అందులో ఇరుక్కుపోయింద‌ని ఢిల్లీ వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. వ్య‌వ‌సాయ చ‌ట్టాల విష‌యంలో కేంద్రం మొద‌టి నుంచి ఏక‌ప‌క్షంగానే వ్య‌వ‌హ‌రిస్తున్న‌దని విమ‌ర్శించారు. ఈ వివాదాస్ప‌ద చ‌ట్టాల‌పై రైతులు గ‌త 29 రోజులుగా ఆందోళ‌నలు చేస్తున్న‌ప్ప‌టికీ ప‌ట్టించుకోవ‌డంలేద‌ని, చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకునే విష‌యంలో మొండిగా వ్య‌వ‌హరిస్తున్న‌ద‌ని విమ‌ర్శించారు. ఈ చ‌ట్టాల విష‌యంలో అహానికిపోయిన‌ మోదీ స‌ర్కార్ ఇప్పుడు ఇర‌కాటంలో ప‌డింద‌ని చెప్పారు. 

బీజేపీ నేత‌లు, కేంద్ర మంత్రులు ఆందోళ‌న చేస్తున్న రైతుల‌ను ఖలిస్థానీల‌ని, మావోయిస్టు‌లు, టెర్ర‌రిస్టుల‌ని, ఒక్క‌టేమిటి వారిని అన‌ని మాటేలేద‌ని, రైతుల‌ను అనేక విధాలుగా అవ‌మానించార‌ని చెప్పారు. రైతుల ఆందోళ‌న‌ను తేలిక‌గా తీసుకున్నార‌ని, ఈ విష‌యంలో ఇప్ప‌టికే చాలా ఆల‌స్య‌మ‌య్యింద‌ని, ఇప్పుడు వారి వ్యూహాలు ప‌నిచేయ‌డం లేద‌న్నారు.     ‌

నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళ‌న‌లు 29వ రోజుకు చేరుకున్నాయి. ఈ చ‌ట్టాల విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వంతో ఆరుద‌ఫాలుగా చ‌ర్చ‌లు జ‌రిపిన‌ప్ప‌టికీ ఒక కొలిక్కిరాలేదు. చ‌ట్టాల్లో స‌వ‌ర‌ణ‌లు చేస్తామేకానీ, వాటిని ఎట్టిప‌రిస్థితుల్లో ర‌ద్దుచేసేది లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.   ‌ 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్   డౌన్లోడ్ చేసుకోండి.logo