బుధవారం 27 జనవరి 2021
National - Nov 28, 2020 , 15:47:38

రైతు సంఘాల‌తో చ‌ర్చ‌కు రెడీ: కేంద్ర వ్య‌వ‌సాయ మంత్రి

రైతు సంఘాల‌తో చ‌ర్చ‌కు రెడీ:  కేంద్ర వ్య‌వ‌సాయ మంత్రి

హైద‌రాబాద్‌:  రైతుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు.. రైతు సంఘాల‌తో చ‌ర్చ‌లు నిర్వ‌హించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ తెలిపారు. డిసెంబ‌ర్ మూడ‌వ తేదీన చ‌ర్చ‌ల‌కు రైతు సంఘాల‌ను ఆహ్వానించిన‌ట్లు మంత్రి తెలిపారు.  కొత్త వ్య‌వసాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ పంజాబ్ రైతులు.. ఢిల్లీలో ఆందోళ‌న చేప‌డుతున్న విష‌యం తెలిసిందే.  అయితే తాము నిర్వ‌హించ‌బోయే స‌మావేశాల‌కు రైతులు హాజ‌రు అవుతార‌ని మంత్రి తోమ‌ర్ ఆశాభావం వ్య‌క్తం చేశారు.  రైతుల పేరుతో పార్టీలు  రాజ‌కీయం చేయ‌డం మానుకోవాల‌ని మంత్రి చెప్పారు. రైతుల స‌మ‌స్య‌ల‌ను రాజ‌కీయం చేస్తున్న‌ట్లు హ‌ర్యానా సీఎం మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ ఆరోపించారు. పంజాబ్ రైతులు ఆందోళ‌న చేప‌డుతున్నార‌ని, హ‌ర్యానా రైతులు ఆ నిర‌స‌న‌కు దూరంగా ఉన్నార‌న్నారు.  ఎంతో సంయ‌మ‌నం పాటించిన హ‌ర్యానా రైతులు, పోలీసుల‌కు ఆయ‌న థ్యాంక్స్ చెప్పారు. ఆందోళ‌న‌ల‌కు పంజాబ్ సీఎం ఆజ్యం పోస్తున్నార‌ని ఖ‌ట్ట‌ర్ ఆరోపించారు. 
logo