బుధవారం 03 జూన్ 2020
National - May 17, 2020 , 12:02:43

కోవిడ్‌19 నియంత్ర‌ణ‌కు 15వేల కోట్లు..

కోవిడ్‌19 నియంత్ర‌ణ‌కు 15వేల కోట్లు..


హైద‌రాబాద్‌: కోవిడ్‌19 మ‌హమ్మారి నియంత్ర‌ణ‌కు కేంద్ర ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు.  ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. క‌రోనా నేప‌థ్యంలో ఆరోగ్య ర‌క్ష‌ణ కోసం సుమారు 15వేల కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్లు ఆమె చెప్పారు. కోవిడ్ నియంత్రణ చ‌ర్య‌ల కోసం ఆయా రాష్ట్రాల‌కు సుమారు 4113 కోట్లు రిలీజ్ చేశామ‌న్నారు. పీఎంజీకేవై స్కీమ్ కింద హెల్త్ ప్రొఫెష‌న‌ల్స్‌కు 50 ల‌క్ష‌ల బీమా క‌ల్పించిన‌ట్లు ఆమె తెలిపారు. కోవిడ్‌19 సంక్షోభ స‌మ‌యంలో ప్ర‌పంచ దేశాల‌కు భార‌త్ ఆద‌ర్శంగా నిలిచింద‌న్నారు. పీపీఈ కిట్ల త‌యారీలో మెరుగైన ప్ర‌గ‌తి సాధించింద‌న్నారు.  పీపీఈలో ఎటువంటి ఉత్ప‌త్తిదారులు లేన‌టువంటి స్థాయి నుంచి సుమారు 300 మంది దేశీయ ఉత్ప‌త్తిదారులు క‌లిగిన స్థితికి చేరుకున్న‌ట్లు మంత్రి తెలిపారు. వివిధ దేశాల‌కు  సుమారు 11 కోట్ల హైడ్రోక్లోరోక్వీన్ మాత్ర‌ల‌ను స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు ఆమె చెప్పారు. ఎపిడ‌మిక్ డిసీజెస్ చ‌ట్టాన్ని స‌వ‌రించిన‌ట్లు మంత్రి తెలిపారు.logo