గురువారం 28 జనవరి 2021
National - Nov 29, 2020 , 18:15:17

అధికారులు అప్రమత్తంగా ఉండాలి : కేరళ సీఎం

అధికారులు అప్రమత్తంగా ఉండాలి : కేరళ సీఎం

తిరువనంతపురం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో దక్షిణ కేరళలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెవెన్యూ, అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం పినరయ్‌ విజయన్‌ సూచించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు.

డిసెంబర్‌ 1 నుంచి అలలు పోటెత్తే అవకాశం ఉండటంతో రేపటి అర్ధరాత్రి నుంచి సముద్ర తీర ప్రాంతాల్లో సంచారంపై నిషేధం విధించారు. ఇప్పటికే సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్లిన వారు ఈ నెల 30 రాత్రిలోపు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా ఇప్పటికే తిరువనంతపురం, కొల్లాం జిల్లాలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. డిసెంబర్‌ 1న పథానంథిట్ట, ఇడిక్కి జిల్లాల్లో 2న తిరువనంతపురం, కొల్లాం జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo