శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 14:51:09

కలర్ టీవీల దిగుమతి విధానాన్ని స‌వ‌రించిన కేంద్రం

కలర్ టీవీల దిగుమతి విధానాన్ని స‌వ‌రించిన కేంద్రం

న్యూఢిల్లీ: కలర్ టెలివిజన్ సెట్ల దిగుమతి విధానాన్ని కేంద్ర ప్ర‌భుత్వం స‌వ‌రించింది. ఇప్ప‌టి వ‌ర‌కు అన్ని సైజుల కల‌ర్ టీవీ సెట్ల దిగుమ‌తి 'ఉచిత' కేట‌గిరీ కింద ఉండేది. దీనిని  'పరిమితం' కేట‌గిరీకి స‌వ‌రించింది. ఈ మేర‌కు లైసెన్స్ మంజూరు చేసే విధానాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) విడిగా జారీ చేస్తుంద‌ని కేంద్ర‌ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ శుక్ర‌వారం తెలిపింది. క‌లర్ టీవీల దిగుమ‌తికి సంబంధించిన విదేశీ వ్యాపార విధానాన్ని స‌వ‌రించిన‌ట్లు ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.


తాజావార్తలు


logo