శనివారం 23 జనవరి 2021
National - Jan 13, 2021 , 17:26:07

ఫొటోషాప్‌ ద్వారా పోలీస్‌కు మాస్క్‌.. నెటిజన్ల ట్రోలింగ్‌

ఫొటోషాప్‌ ద్వారా పోలీస్‌కు మాస్క్‌.. నెటిజన్ల ట్రోలింగ్‌

లక్నో: ఫొటోషాప్‌ ద్వారా మాస్క్‌ ధరించినట్లుగా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఒక పోలీస్‌ ఫొటోను నెటిజన్లు ట్రోలింగ్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని గొరఖ్‌పూర్‌ పోలీసులు ఒక నిందితుడ్ని అరెస్ట్‌ చేసిన ఫోటోను ట్వీట్‌ చేశారు. అయితే అందులో ఉన్న పోలీస్‌తోపాటు నిందితుడు కరోనా నిబంధనలు పాటించకపోవడం, మాస్క్‌ ధరించకపోవడంపై నెటిజన్లు ప్రశ్నించారు. దీంతో ఆ ఫొటోను తొలగించిన పోలీసులు దాని స్థానంలో మరో ఫొటో పోస్ట్‌ చేశారు. మొదటి ఫొటోలో ఉన్న పోలీస్‌, నిందితుడు మాస్క్‌ ధరించినట్లుగా ఫొటొషాప్‌ టెక్నిక్‌తో మార్ఫింగ్‌ చేశారు. దీన్ని గమనించిన నెటిజన్లు రెండు ఫొటోలను పక్కన పక్కన ఉంచి ట్రోలింగ్‌ చేశారు. ఫొటోషాప్‌ టెక్నిక్‌ ద్వారా మాస్క్‌ ధరించినట్లు చూపడంపై హేళన చేశారు. మరోవైపు ఈ విషయం పోలీస్‌ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో దీనిపై దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo