ఆదివారం 17 జనవరి 2021
National - Jan 05, 2021 , 12:39:39

అద‌ర్ పూనావాలా భార్య ఎవ‌రు? ఆయ‌న మ‌తం ఏంటి?

అద‌ర్ పూనావాలా భార్య ఎవ‌రు? ఆయ‌న మ‌తం ఏంటి?

న్యూఢిల్లీ: సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా.. ప్ర‌పంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ తయారీదారు. ఇప్పుడు క‌రోనా కోసం ఆక్స్‌ఫ‌ర్డ్‌-ఆస్ట్రాజెనెకా క‌లిసి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను కొవిషీల్డ్ పేరుతో ఇండియాలో త‌యారు చేస్తోంది ఈ సీర‌మ్ ఇన్‌స్టిట్యూటే. ఈ సంస్థ సీఈవో అద‌ర్ పూనావాలా. ప్ర‌స్తుతం ఈయ‌న కోట్లాది మంది భారతీయుల‌తోపాటు ప్ర‌పంచంలోని ఇత‌ర దేశాల‌కు కూడా క‌రోనా వ్యాక్సిన్‌ను పంపిణీ చేసే ప‌నిలో ఉంటే.. మ‌న ఇండియ‌న్స్ మాత్రం మ‌రో ప‌నిలో ఉన్నారు. ఆయ‌న భార్య ఎవ‌రు? అద‌ర్ పూనావాలా మ‌తం ఏంటి? అని గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు.

ఇదేం పోక‌డ‌?

ఇండియాలో ఎవ‌రైనా కాస్త ఫేమ‌స్ అయ్యారంటే చాలు వాళ్ల కుల‌మ‌తాలు, పుట్టుపూర్వోత్త‌రాలు, కుటుంబం గురించి తెలుసుకోవ‌డానికి ఇండియ‌న్స్ తెగ ఆస‌క్తి చూపిస్తారు. ఈసారి కూడా పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. అస‌లు క‌రోనాకు వ్యాక్సిన్ వ‌స్తుందంటే ఎలాంటి విష‌యాలు తెలుసుకోవాలి? అద‌ర్ పూనావాలా ఎవ‌రు?  కొవిషీల్డ్ వ్యాక్సిన్ ధ‌ర ఎంత ఉంటుంది? వ‌్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వ‌స్తుంది? వ‌ంటి ప్ర‌శ్న‌లు అడిగితే ఓకే కానీ.. అసలు వ్యాక్సిన్‌తో సంబంధం లేని ప్ర‌శ్న‌ల‌తో గూగుల్‌ను వేధిస్తున్నార‌ట మ‌న ఇండియ‌న్స్‌. తాజా గూగుల్ ట్రెండ్స్ ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టాయి. 


భార్య ఎవ‌రు? మ‌తం ఏంటి?

అస‌లు ప్ర‌శ్న‌లు త‌ప్ప గూగుల్ ట్రెండ్స్‌లో అన్నీ క‌నిపిస్తున్నాయి. న‌టాషా పూనావాలా, అద‌ర్ పూనావాలా భార్య‌, అద‌ర్ పూనావాలా మ‌తం ఏంటి?, అద‌ర్ పూనావాలా కుటుంబంలాంటి ప్ర‌శ్న‌లు టాప్‌లో ఉన్న‌ట్లు గూగుల్ ట్రెండ్స్ వెల్ల‌డించింది. అద‌ర్ భార్య న‌టాషా సీర‌మ్ సంస్థ‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్‌. స‌రే.. ఆమె గురించి తెలుసుకున్నా ఒకే అనుకోవ‌చ్చు కానీ.. మ‌రీ అద‌ర్ పూనావాలా మ‌తం ఏంటి అన్న ప్ర‌శ్న‌లు ఇండియ‌న్స్ మైండ్‌సెట్‌కు అద్దం ప‌డుతున్నాయి. గ‌త 30 రోజుల ట్రెండ్స్ చూసినా ఇవే ఫ‌లితాలు క‌నిపిస్తుండ‌టం విశేషం.


ఇవి కూడా చ‌ద‌వండి

ఇండియ‌న్ క్రికెట‌ర్‌తో మాట్లాడిన ఆ న‌ర్స్ ఎవ‌రు?

ఆ డీల్ ఆప‌క‌పోయారో.. ఇండియాకు అమెరికా వార్నింగ్‌

కొత్త పార్ల‌మెంట్ బిల్డింగ్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్న‌ల్‌..

కేఎల్ రాహుల్‌కు గాయం.. ఆసీస్ నుంచి వెన‌క్కి