శుక్రవారం 03 జూలై 2020
National - Jun 26, 2020 , 21:33:15

గూగుల్ పేను బ్యాన్ చేయ‌లేదు : ఎన్‌పీసీఐ

గూగుల్ పేను బ్యాన్ చేయ‌లేదు : ఎన్‌పీసీఐ

హైద‌రాబాద్‌: గూగుల్ పే యాప్‌ను బ్యాన్ చేయ‌లేద‌ని నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) ఇవాళ స్ప‌ష్టం చేసింది. భార‌త్‌లో డిజిట‌ల్ పేమెంట్స్‌ను ఎన్‌పీసీఐ సంస్థే ఆప‌రేట్ చేస్తున్నది. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం లాంటి వాటికి యునిఫైడ్ పేమెంట్స్ ఇంట‌ర్‌ఫేస్‌ను డెవ‌ల‌ప్ చేసింది కూడా ఈ సంస్థ‌నే.  జీపే బ్యాన్డ్ బై ఆర్బీఐ అని సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న‌ది. గూగుల్ పే అనేది పేమెంట్స్ సిస్ట‌మ్ ఆప‌రేట‌ర్ కాదు అని ఆర్బీఐ చెప్పిన‌ట్లు ఓ వార్త కూడా సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది. ఈ నేప‌థ్యంలో ఎన్‌పీసీఐ స్పందించింది.  

గూగుల్ పే ఆమోదం పొందిన‌, భ‌ద్ర‌మైన పేమెంట్ యాప్ అని ఎన్‌పీసీఐ స్ప‌ష్టం చేసింది. పేమెంట్స్ సిస్ట‌మ్ ఆప‌రేట‌ర్‌గా గూగుల్ పేను ఆర్బీఐ గుర్తించిన‌ట్లు త‌న ప్ర‌క‌ట‌న‌లో ఎన్‌పీసీఐ తెలియజేసింది. గూగూల్ పేలో జ‌రుగుతున్న లావాదేవీల‌కు చ‌ట్ట  ప్ర‌కారం పూర్తి భ‌ద్ర‌త క‌ల్పిస్తున్న‌ట్లు ఎన్‌పీసీఐ తెలిపింది.logo