సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 16:04:51

గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి 29 యాప్స్‌ అవుట్‌

గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి 29 యాప్స్‌ అవుట్‌

న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్లకు హాని కలిగించే యాప్‌ల గురించి మరో షాకింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది. సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌ యాడ్‌వేర్‌తో నిండిన 29 యాప్‌లను ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది. ఈ యాప్‌లు ప్లేస్టోర్‌లో 3.5 మిలియన్లకుపైగా డౌన్‌లోడ్లు కలిగి ఉన్నాయి. ఈ యాప్స్‌తో ఫోన్‌ అన్‌లాక్ అవ్వడం, యాప్‌లను అన్ ‌ఇన్‌స్టాల్ చేయడం, ఫోన్‌ని ఛార్జ్ చేయడం, మొబైల్ డేటా నుంచి వైఫైకి మారడం వంటివి ఫోన్‌లో ఆటోమెటిక్‌గా జరుగుతున్నాయని తెలిపింది. అలాగే ఫోన్ మొత్తం స్క్రీన్‌ను ఆక్రమిస్తాయని చెప్పింది. ఈ క్రమంలో సతోరి ఇంటలిజెన్స్‌ బృందం ‘చార్ట్రూస్ల్బూర్‌’ పేరుతో జరిపిన పరిశోధనలో యాప్‌లను గుర్తించారు.

వీటిలో అత్యధికంగా ఫొటో ఎడింగ్‌ యాప్‌లో ఉన్నాయి. వీటిలో ఏ యాప్‌ అయినా ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఫోన్‌లో లాంచ్ ఐకాన్స్‌ ఫోన్ నుంచి వెంటనే కనిపించకుండా పోతాయి. దీని ద్వారా యూజర్‌ ఆ యాప్‌లను డిలీట్ చేయడానికి కష్టంగా మారుతుంది. ఇక యాప్‌ల ద్వారా కనిపించే ప్రకటనలు కొన్ని సెకన్ల వ్యవధిలోనే జరిగిపోతుంటాయి. వీటిని హానికరంగా భావించిన గూగుల్‌ సదరు 29 యాప్‌లను తొలగించి. భవిష్యత్‌లో ఇలాంటి యాప్‌ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, ఇందుకు సతోరి బృందం సలహాలు సూచనలు ఇస్తుందని చెప్పింది.

గూగుల్‌ రిమూవ్‌ చేసిన వాటిలో ఆటో పిక్చర్‌ కట్‌, కలర్‌ కాల్‌ ఫ్లాష్‌, స్క్వేర్‌ ఫొటో బ్లర్‌,  స్క్వేర్‌ బ్లర్‌ఫొటో, ఈజీ బ్లర్‌, మ్యాజిక్‌ కాల్‌ ఫ్లాష్‌,  ఇమేజ్‌ బ్లర్‌,  ఆటో ఫొటో బ్లర్‌, ఫొటో బ్లర్‌,  ఫొటో బ్లర్‌ మాస్టర్‌, సూపర్‌ కాల్‌ స్క్రీన్‌, స్క్వే్ర్‌ బ్లర్‌ మాస్టర్‌,  స్క్వేర్‌ బ్లర్‌, స్మార్ట్‌ బ్లర్‌ ఫొటో,  స్మార్ట్‌ ఫొటో బ్లర్‌, సూపర్‌ కాల్ ఫ్లాష్‌, స్మార్ట్‌ కాల్‌ ఫ్లాష్‌, బ్లర్‌ ఫొటో ఎడిటర్, బ్లర్‌ ఇమేజ్‌ యాప్‌లు ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ యాప్‌లన్నింటినీ గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి తొలగించింది. ఈ యాప్‌లు ఎవరి ఫోన్లలోనైనా ఉంటే అన్‌ ఇన్‌స్టాల్‌ ‌ చేయాలని సూచించింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo